చైనా పరిస్థితి రానురాను దిగజారుతూ వస్తుంది, భారత్ అంతకంతకు పెరిగిపోతూనే ఉంటుంది అనేది ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే తరహాలో స్టాక్ మార్కెట్ల సరళి ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం చైనా స్టాక్ మార్కెట్లు రోజురోజులు పడిపోతుంటే, భారత స్టాక్ మార్కెట్లు పైపైకి చూస్తున్నాయి. ఈ తరహా భారత అభివృద్ధి దాదాపు మరో 50 ఏళ్లపాటు ఉండొచ్చని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టడం రానున్న రోజులలో జరుగుతూనే ఉంటుందని, మరో ఐదు దశాబ్దాలు భారతదేశానికి తిరుగుండదని వారు వ్యాఖ్యానించారు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోని ఎన్నారై లు కూడా తమ పెట్టుబడులతో 80శాతం భారత్ లోనే పెడుతున్నారని గ్లోబల్ ఇండియన్ పల్స్ తెలిపింది.

మార్క్ మోబియస్ ప్రపంచ స్టాక్ మార్కెట్ కింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనా గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ పెట్టుబడుల విషయంలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారతీయులు ఎక్కడ ఉన్నప్పటికీ వారి చూపు మాత్రం దేశంపైనే ఉన్నదని, అందుకే వారందరు పెట్టుబడులు కేవలం ఇక్కడే పెట్టడానికి సుముఖంగా ఉన్నారు. ఇదంతా భారత్ కు కలిసి వచ్చే కాలం. గతంలో ఇలాంటి పరిస్థితి రావాల్సి ఉండగా, చైనా గద్దలా వచ్చి తన్నుకుపోయి, ఇప్పటి వరకు కులికింది. ఇప్పటికైనా భారత్ మరోసారి స్వయంకృషితో అవకాశాన్ని దక్కించుకుంటుంటే అక్కసుతో యుద్ధాలకు తెగబడుతుంది.

ప్రస్తుతం తైవాన్ పై కానీ భారత సరిహద్దులలో కానీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనుక ఇదే ఉద్దేశ్యం తప్ప మరొకటి లేదు. భారత్ ఎప్పుడు తనను మించిపోతుందేమో అనే భయం తప్ప చైనాలో మరొకటి లేదు, ఆ భయం ఇటీవల బాగా పెరిగినట్టుగానే ఉంది అందుకే, యుద్ధం చేయడానికి కూడా పూనుకుంటుంది. అసలు దాని పరిస్థితే దిక్కుతోచని విధంగా ఉన్నప్పటికీ యుద్దానికి సన్నాహాలు చేస్తూ ఉండటం తోనే ఊహించవచ్చు, దానికి భారత్ అంటే ఎంతభయంగా ఉన్నదో అని.

మరింత సమాచారం తెలుసుకోండి: