కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోటలు ఏవి అంటే...ఠక్కున గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు పేర్లు చెప్పేయొచ్చు. ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీకి ఎప్పుడు అండగానే ఉంటూ వచ్చాయి....కానీ ఇదంతా ఒకప్పుడు...ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ రెండు చోట్ల టీడీపీ ఎలా గెలవాలనే తర్జనభర్జన పడుతుంది. అదేంటి కంచుకోటల్లో గెలవడానికి టీడీపీ ఇన్ని కష్టాలు ఎదురుకోవాల్సి వస్తుందా? అంటే అవును కష్టాలు తప్పట్లేదనే చెప్పాలి...ఎందుకంటే ఆ రెండు చోట్ల ఉన్నది ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీలు.

కృష్ణాలో ఈ ఇద్దరుకు ఉన్న మాస్ ఫాలోయింగ్ మరో నాయకుడుకు లేదనే చెప్పాలి. రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందులో కొడాలి నాని గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే గుడివాడలో కొడాలిని వరుసగా రెండుసార్లు ఓడించలేక టీడీపీ నానా కష్టాలు పడుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కొడాలి గెలుపుని టీడీపీ ఆపేలా లేదు. అయితే గుడివాడలో లేకపోయినా గన్నవరంలో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ ఉందనే చెప్పాలి.

ఎందుకంటే వంశీ మొన్నటివరకు టీడీపీలో ఉంటూనే..వైసీపీ వైపుకు వెళ్లారు. కాబట్టి ఆయనకు చెక్ పెట్టడానికి టీడీపీకి కాస్త అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాల్ని సరిగ్గా ఉపయోంచుకోవాలి. కాకపోతే టీడీపీ ఆ దిశగా మాత్రం పనిచేస్తున్నట్లు లేదు. ఫుల్ ఫాలోయింగ్ ఉన్న వంశీకి ప్రత్యర్ధిగా బచ్చుల అర్జునుడు లాంటి సాఫ్ట్ నాయకుడుని పెట్టారు.

ఈయనకు గానీ నెక్స్ట్ సీటు ఇస్తే గన్నవరంలో వంశీ గెలుపు ఆపడం కష్టమని టీడీపీ శ్రేణులే మాట్లాడే పరిస్తితి. అందుకే ఇక్కడ బలమైన నాయకులని పెట్టమని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం బరిలో గద్దె అనురాధా, పుట్టగుంట సతీశ్ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా కమ్మ వర్గానికి చెందిన సుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నా ఆమె...టీడీపీలోకి రావడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో ఆమె సొంత నియోజకవర్గం గన్నవరం. గతంలో వంశీపై ఆమె గట్టిగానే పోరాడారు. దీంతో పద్మశ్రీకి సీటు ఇచ్చినా వంశీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని కొందరు తమ్ముళ్ళు చెబుతున్నారు. మరి చూడాలి గన్నవరంలో ఇంకా ఎంతమంది పేర్లు వినబడతాయో?


మరింత సమాచారం తెలుసుకోండి: