ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా కొనసాగుతుంది అమెరికా. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే అమెరికా ముఖ్యమైన ఆదాయం అటు ఆయుధాలను విక్రయించడమే అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలోని ఎన్నో దేశాలకు అమెరికా ఆయుధాలను విక్రయిస్తూ భారీగా ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని దేశాలకు కూడా అమెరికా ఆయుధాలు విక్రయించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆయుధాల విక్రయాలలో అమెరికా వ్యవహరించే తీరు కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.



 కొన్ని కొన్ని సార్లు కొన్ని దేశాలతో దౌత్య పరంగా మిత్ర దేశంగానే కొనసాగుతున్నప్పటికీ ఇక ఆయుధాల విక్రయం విషయంలో మాత్రం అమెరికా పెట్టె కండిషన్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎన్నో కండిషన్ ల మధ్య అమెరికా ఆయుధాలను విక్రయించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ విషయంలో కూడా అమెరికా ఇలాంటి కొత్త కండిషన్ను తెరమీదకు తెచ్చి నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం నుండి ఇజ్రాయెల్ తో ఎంతో స్నేహబంధాన్ని కొనసాగిస్తుంది అమెరికా. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ తో చేతులు కలిపి  ఇరాన్ పై ఇజ్రాయిల్ తో కలిసి దాడులకు కూడా పాల్పడింది.



 ఇక ఇలా ఇజ్రాయిల్ అమెరికా మధ్య దౌత్యపరమైన బంధం ఎంతో బలపడింది అని చెప్పాలి. కానీ ఇటీవలే ఇజ్రాయెల్ కు ఆయుధాలు విక్రయించడం విషయంలో మాత్రం అమెరికా వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇజ్రాయిల్ రిక్వెస్ట్ ను  అటు అమెరికా రిజెక్ట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికా దగ్గర ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. ఇరాన్ సైన్యం దూకుడుగా ఇజ్రాయిల్ మీద యుద్ధానికి  సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇంతకుముందే అమెరికా తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఆయుధాలను ఇవ్వాలి ఇజ్రాయిల్ రిక్వెస్ట్ చేయగా.. ఇప్పట్లో ఇచ్చేది లేదని ఇంకా ఎంతో సమయం పడుతుంది అంటూ అటు అమెరికా ఇజ్రాయిల్ కు షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: