కాపీ పేస్ట్ ఫ్మారులాలో టీడీపీ
జ‌గ‌న్ ను అనుక‌రిస్తున్న బాబు
ఫార్ములా పండితే నాలుగు సీట్లు
ఎక్కువే కొట్టేయొచ్చు అని ప్లాన్


అధికారం ఉన్నా లేక‌పోయినా అధికారంలో ఉన్న విధంగానే న‌డుచుకోవ‌డం టీడీపీకి సాధ్యం అయ్యే ప‌నిలాలేదు. కానీ కొన్నింట మాత్రం అధికారం ఉన్న విధంగానే ప్ర‌వ‌ర్తించ‌డం మాత్రం కార్య‌క‌ర్త‌ల‌కు ధీమా పెంచుతోంది. గ‌తంలో వైసీపీలో సీనియ‌ర్లు  కూడా ఇలానే ప్ర‌వ‌ర్తించారు. తామే అధికారంలో ఉన్న విధంగా విప‌క్షంలో ఉన్న‌ప్పుడు న‌డుచుకుని యంత్రాగాన్ని ప‌రుగులు తీయించారు కూడా! వారి సంగ‌తి ఎలా ఉన్నా చంద్ర‌బాబు మాత్రం విప‌క్ష నేత హోదాను బాగానే న‌డిపిస్తున్నారు. ఇదే ఉత్సాహంలో భాగంగా త‌న ప‌నులు బాగానే చేయించుకుంటున్నార‌ని కూడా ఓ ఓపెన్ సీక్రెట్ .. ఇక పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న ఫార్ములా మాత్రం కాపీ కొడుతున్నారు. అదేంటంటే...
 
వైసీపీ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ పెద్ద హిట్ అయింది. జ‌గ‌న్ ఎంచుకున్న ప‌ద్ధ‌తి కూడా బాగుంది. ప్ర‌తి యాభై ఇళ్ల‌కూ ఓ వ‌లంటీరు అని చెప్పినా కొన్ని చోట్ల 80 ఇళ్ల‌ను కూడా ఒక్కో వ‌లంటీర్ కు కేటాయించిన దాఖ‌లాలు ఉన్నాయి. అయితే వీరికి ఇచ్చే జీతం మాత్రం పెర‌గ‌లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ ఐదు వేలు మాత్ర‌మే చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ చేప‌ట్టిన ప‌నులు వాటి వివ‌రాలు ఇవ‌న్నీ తెలియ‌జేయ‌డంలో వ‌లంటీరు ముందుంటున్నా జీతం ఒక్క‌టే వీరి ఉన్న అసంతృప్తి. అయితే విలేజ్ ల‌లో వీరికి గుర్తింపు మాత్రం బాగుంటుంది. అధికారుల‌కు  కూడా వీరు బాగానే స‌హ‌క‌రిస్తున్నారు. ఓ విధంగా విలేజ్ ల‌లో వ‌లంటీరు అంటే ఓ మినీ సెల‌బ్రిటీ.. ఇదే దృష్టిలో ఉంచుకుని వైసీపీ మాదిరిగానే టీడీపీ కూడా ఒక వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌ను నిర్మించాల‌ని భావిస్తోంది. ఇదీ ఇప్పుడు చంద్ర‌బాబు మదిలో మెదులుతున్న ఆలోచ‌న. దీనివ‌ల్ల త‌మ ప‌రిధిలో పార్టీని విస్త‌రింప‌జేయ‌డంతో పాటు మ‌రికొంద‌రిని పార్టీ వైపు న‌డిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: