గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అనేవి చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు.  కరీంనగర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగులకు సమస్య గురించి నిరసన దీక్ష కూర్చుంటే పోలీసులు  అరెస్టు చేసి  జైల్లో పెట్టారని, దీంతో బండి సంజయ్ ని పరామర్శించేందుకు వచ్చినటువంటి బిజెపి నేత జేపీ నడ్డా చేసినటువంటి  కామెంట్స్ పై  కేటీఆర్ చాలా ఘాటుగా బదులిచ్చారు.

ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పెద్దమనిషి ఆయన మాట్లాడిన మాటలు చేసిన విమర్శలు చాలా జుగుప్సాకరంగా,  చాలా నీచంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల ఆయన మాట్లాడిన చిల్లర మాటలు వారికి సమాధానం ఇవ్వకపోయినా కానీ ప్రజల దృష్టికి కొన్ని వాస్తవాలు తెలియజేయాలి. ఇప్పటివరకు జేపీ నడ్డా అంటే పెద్దమనిషి కేంద్రంలో ఒక మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి చదువుకున్నాడు. జ్ఞానం ఉన్న వ్యక్తి అని ఆయనపై అభిప్రాయం ఉండేది. కానీ నిన్ను ఆయన మాట్లాడిన మాటలు వింటే ఆయనకు బండి సంజయ్ కి ఏం తేడా  లేదన్న విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఎందుకంటే బిజెపిలో బండి అయినా గుండు అయినా ఏ గుండు  అయినా అంతే అని చాలా స్పష్టంగా బయటపడింది. బిజెపి అంటే ఇన్నిరోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాము కానీ బక్వాస్ జుమ్లా పార్టీ, మాట్లాడితే చెత్త పనికి మాలిన విమర్శలు బక్వాస్ మాటలు తప్ప ఏడున్నర సంవత్సరాలలో ఈ దేశ ప్రజలకు ఏ వర్గానికి అయినా ఏమైనా చేశారా అంటే చెప్పుకోడానికి కనీసం ఏమీ లేదు. మొత్తం గుండు సున్నా. ఒక ఉదాహరణ ఏమిటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో  ఐదు సంవత్సరాల బిజెపి  పాలన తర్వాత మళ్లీ ఎన్నికల్లోకి వీరు ఏ నినాదం మీద వెళ్లాలి. ఈ పని చేశాం.

మాకు ఓటేయండి అని అడగాలి. కానీ వాళ్ల దౌర్భాగ్యం ఏంటంటే అక్కడి గుండాలు ప్రస్తుతం తగ్గి పోయారని అందుకే ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కానీ వీళ్ళు ప్రజలకు చేసిన ఒక్క పని కూడా లేదు. వీళ్లు హిందూ ముస్లిం అనే ఒక మత పిచ్చితో హిందువులను ముస్లింలను వేరుచేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి దేశంలో చిచ్చు రాజేసి ఎన్నికల్లో గెలవాలనే బక్వాస్ జుమ్లా పార్టీ  బిజెపి పార్టీ అని ఆయన మండిపడ్డారు. మీరు దేశానికి చేసింది ఏమీ లేదు కానీ తెలంగాణలో కేసీఆర్ ను విమర్శిస్తారా అంటూ కడిగిపారేశారు. ఏమయ్యా బండి నీ బండి పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ, నీ గుండు పగిలితే మళ్లీ కొనుక్కో లేవు. ఎందుకలా బాదుకుంటున్నవ్ అని వ్యంగ్యంగా మాట్లాడారు. దయ్యాలు బిజెపి ఒకటేనని మిమ్మల్ని ఎవరూ మార్చలేరు అని గట్టిగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: