పాల‌న‌పై అస్స‌లు ప‌ట్టు లేదు..పోలీసు యంత్రాంగం అంతా అధికార పార్టీ మ‌నుషులే! అనేందుకు ఉదాహ‌ర‌ణ చిత్తూరు జిల్లా, గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వర్గం, కార్వేటి మండ‌లంలో నాటు సారా ఉద్ధృతి.. సారా ఏరుల‌యి పారుతోంది.. ఇక్క‌డ.. ఇక పండ‌గ వేళ‌ల్లో తమ ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయం అని, తాగుబోతుల కార‌ణంగా ప్ర‌శాంత‌త కొర‌వ‌డుతోంద‌ని స్థానిక పోలీసుల‌కు చెబితే, వాళ్లంతా చూసీ చూడ‌ని విధంగానే ఉంటున్నారు.. అన్న‌ది ఓ స్థానిక ఆరోప‌ణ‌..బాధిత అభియోగం.


దేనినీ నియంత్రించ‌లేని స్థితిలో పోలీసులు ఉన్నారా? అంటే సారాయి అమ్మ‌కాల‌ను మ‌రీ! ముఖ్యంగా సారాయి అక్ర‌మ ర‌వాణాను దేనినీ అడ్డుకోలేక‌పోతున్నారా? అయితే దేవుడి పాల‌న‌లో ఉన్న అన్యాయం పై పోరాడే మ‌హిళ‌లకు క‌నీసం మ‌ద్ద‌తు అయినా ఇవ్వాలి క‌దా! ఇప్ప‌టికే ఎన్నో సార్లు ఈ వివాదం న‌మోదు అయి ఉన్నా కూడా పాపం పాల‌కులకు సారాయిని నియంత్రించే శ‌క్తి లేద‌ని తేలిపోయింద‌ని విప‌క్షం మండిప‌డుతోంది.

డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి (ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా ఈయ‌నే) సొంత ఇలాకాలో వివాదం రేగుతోంది. చిత్తూరు జిల్లా, గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో సారా అమ్మ‌కాలు జోరందుకుంటున్నాయి.మంత్రి వీటిపై దృష్టి సారించాల‌ని కార్వేటి న‌గ‌రం పోలీసు స్టేష‌న్ ఎదుట ఎస్సీ కాల‌నీ మ‌హిళ‌లు బైఠాయించి నిర‌స‌న‌లు తెలిపారు.త‌మ ప్రాంతంలో నాటుసారా అమ్మ‌కాలు ఆగ‌డం లేద‌ని వీరంతా వాపోతూ రోడ్డెక్కారు.

వివాదాల‌కు ఆన‌వాలుగా నిలిచే నారాయ‌ణ స్వామి గ‌త కొద్ది కాలంగా పెద్దిరెడ్డి తో క‌లిసి హాయిగా రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ అయితే ఉంది. సీఎంకు వీర‌విధేయుడిగా ఉంటూ కీల‌క సంద‌ర్భాల్లో పొంత‌న‌లేని ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అయితే త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ఈ స‌మ‌స్య‌పై గ‌త కొంత కాలంగా ర‌గ‌డ నెల‌కొంద‌ని తెలుస్తోంది.
కార్వేటి న‌గ‌రం మండ‌ల కేంద్రంలో మ‌హిళ‌లు అంతా ఎప్ప‌టి నుంచో పోలీసులను ఆశ్రయించినా ఫ‌లితం లేకుండా ఉంది. ఇక్క‌డ సారా అమ్మ‌కాలు నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp