ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య జరుగుతున్న ఘాటు చర్చల్లో విద్యుత్ ఛార్జీలు కూడా ఒక అంశం. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ప్రతిపక్షాలు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్యుత్ చార్జీలపై రాయితీ కూడా అందుతునే ఉంది. దిగువ స్థాయి ప్రజలు ఎవరైతే సొంత ఇంటిని కలిగి ఉండి ప్రభుత్వం కేటాయించిన యూనిట్ల లోపు వినియోగించి ఉంటారో వారికి విద్యుత్ ఛార్జీ జీరో వస్తుంది. అయితే ఇందుకు ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంది. ఇదిలా ఉండగా మరో వైపు వరుసగా విద్యుత్ పెంపు పై ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అవి ఒక ఇంటికి పడే బిల్లు కనుక చూసుకుంటే తక్కువ పెంపు  అయినా మొత్తం మీద పెంచిన ఛార్జీలు కనుక చూస్తే  ప్రజలపై రూ.1200 కోట్ల భారం పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు మునపటి ప్రభుత్వంతో పోల్చుకుంటే విద్యుత్ చార్జీల పెంపు అదుపులోనే ఉన్నాయని పాలక పక్షం అంటున్నారు. ఇలా విద్యుత్ చార్జీలపై  ఎవరికీ వారు సమర్ధింపు చర్చలు నడుస్తున్న క్రమంలో ఏపీ లో  విద్యుత్ చార్జీలపై ప్రజల నుండి అభిప్రాయాన్ని  తెలుసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుండి ఈ సర్వే ప్రారంభం కానుంది.

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 24, 25 మరియు 27 తేదీలలో ప్రత్యేక సదస్సులు నిర్వహించి విద్యుత్ చార్జీలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఒకవేళ ఎవరి కైనా అభ్యంతరాలు కనుక ఉంటే వారికి సమీప విద్యుత్ సర్కిల్ డివిజన్ కార్యాలయం నుంచి పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలియ చేసింది ప్రభుత్వం. మరి ఈ సర్వే వలన ఎవరికీ ఉపయోగం కలగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: