గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందినప్పటి నుంచి ఎన్నికలంటేన ఆ పార్టీ భయపడుతోంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఇంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉందనే విషయాన్ని ఎన్నికల ఫలితాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించలేకపోయింది. ఇక ఆ తరువాత ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రజా ఉద్యమాలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం, జగన్ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడింది. కొద్ది రోజుల క్రితం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా విశాఖకి వెళ్ళిన చంద్రబాబుకు ప్రజా ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో తెలిసొచ్చింది. తన యాత్ర ముందుకు వెళ్లకుండా అడుగడుగునా విశాఖ ప్రజలు అడ్డుపడడంతో తన యాత్ర ప్రారంభించినా బాబు ముగించాల్సి వచ్చింది. 

IHG


ఇక అప్పటి నుంచి జనాల్లో తిరిగేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం, ఎన్నికల నోటిఫికేషన్ లో పేర్కొనడంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది. ఈ మేరకు ఎన్నికలు నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తూనే, బిసి రిజర్వేషన్ తో పాటు కరోనాను కూడా టిడిపి కారణంగా చూపిస్తోంది. అంతేకాకుండా సుప్రీంకోర్టులో టిడిపి వేసిన బీసీల రిజర్వేషన్ పిటిషన్ లో రాష్ట్రప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

IHG

రిజర్వేషన్లలో 10 శాతం కోత విధించి బీసీ హక్కులకు భంగం కలిగించారని ఆరోపిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం, బీసీల రాజకీయ అవకాశాలు రాకుండా చేశారు అంటూ మరో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీసీ నాయకుడు నిమ్మల కిష్టప్ప అయితే కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని, క్యూలైన్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ ఆయన మరో వాదన తెరమీదకు తెచ్చారు. వాస్తవంగా అయితే ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా స్థానిక సంస్థల ఫలితాలు రావడం పరిపాటిగా ఉంటుంది. 


ఆ భయంతోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికలంటేనే భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక అధికారులు కూడా ప్రభుత్వం చేతిలో ఉంటారు కాబట్టి తమకు ప్రతికూల ఫ్జలితాలే  వస్తాయని, మరోసారి ప్రజల ముందు భంగపాటు తప్పదని టిడిపి నేతలు ఆందోళనలో ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు వాయిదా వేయించాలని కృతనిశ్చయంతో టిడిపి నాయకులు పావులు కదుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: