ఈ మధ్యకాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది విషయం తెలిసిందే. మామూలు వ్యక్తులలాగా రెక్కీ  నిర్వహించడం ఆ తర్వాత పక్కా ప్లాన్ తో  చోరీలకు పాల్పడటం  చేస్తున్నారు దొంగలు. రోజురోజుకు దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సవాలుగా మారిపోతుంది. ఇక్కడ ఓ దొంగ ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డాడు. కేవలం ఒకే రకమైన దొంగతనాలకు పాల్పడితే  మజా ఏముంది అనుకున్నాడో ఏమో... ఏకంగా మూడు రకాల దొంగతనాలకు పాల్పడ్డాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. సెల్ఫోన్ స్నాచింగ్ వాహన చోరీలు ఇళ్లలో దొంగతనాల చేస్తున్నా కుంచె  కోటి అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్  పోలీసులు అరెస్టు చేశారు

 

 

 నిందితుడి నుంచి 1.2 లక్షల విలువైన సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లాకు చెందిన కోటికి ఈశ్వర్, బంటి  అనే మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. అయితే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు కోటి. ఈ క్రమంలోనే జియాగూడ లో నివాసం ఉంటున్నాడు. ఇక రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగించే కోటి వ్యసనాలకు బానిస గా మారిపోయాడు. కూలి పని చేస్తే వచ్చే డబ్బుతో జల్సాలు చేయడం సాధ్యం కాదు అని భావించి... దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2016 సంవత్సరం నుంచి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. గతంలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేయగా పలు పోలీస్ స్టేషన్లో ఇతడిపై కేసులు కూడా ఉన్నాయి.. అయితే ప్రధాన రహదారిలో సీసీ కెమెరాలు ఉంటాయి అని తెలివిగా ఆలోచించి చిన్నచిన్న రూట్లలో సందుల్లో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు. 

 

 

 చోరీ చేసిన తర్వాత ఎలాంటి అయోమయానికి గందరగోళానికి గురికాకుండా తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తుంటాడు. రాత్రివేళల్లో తెల్లవారుజామున రంగంలోకి దిగి ఫోన్లో మాట్లాడే వారిని గుర్తిస్తాడు. అలా  ద్విచక్రవాహనంపై వచ్చి సెల్ ఫోన్ లాక్కొని ఉడాఇస్తాడు. ఇక ఏకంగా వాహనాల దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. తాజాగా సైఫాబాద్, ఆసిఫ్నగర్ ఠాణా  పరిధిలో సెల్ఫోన్లు దొంగతనం తో పాటు వాహన చోరి  ఇంట్లో దొంగతనాలు కూడా చేశాడు. దీంతో అతడిని పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్  బృందం రంగంలోకి దిగి నిందితున్ని పట్టుకొని.. దొంగతనం చేసిన సొత్తును మొత్తం రికవరీ చేసింది. ఆ తదుపరి సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: