ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అన్ని ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన విచక్షణ అధికారం ఉపయోగించి వాయిదా వేయడం చుట్టూనే నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగని జగన్ నేరు గా ప్రెస్ మీట్ పెట్టి అటు రమేష్ కుమార్ తో పాటు ... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. జగన్ తన కోపాన్ని అంతా క‌క్కేశారు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను నేరుగా ప్రశ్నించడం అసాధారణమే. అయితే జగన్ అవి పట్టించుకున్నట్టు లేదు.



జగన్ దగ్గర మొహమాటం.. మ‌ర్యాద‌లు ఏమాత్రం పనిచేయవు. జగన్ తడాఖా చూపిస్తే ఎలా ఉంటుందో మరొకసారి స్పష్టమైంది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారి అని... ఆయన నియామకం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని... జగన్ వారిద్దరి బంధాన్ని ఓపెన్ గానే చెప్పేశారు. ఇదిలా ఉంటే వైసిపి సోషల్ మీడియా ఈరోజు ఉదయం ఎన్నికలను వాయిదా వేసిన అప్పటినుంచి నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ దాడికి దిగింది. రమేష్ కుమార్ కుమార్తె నిమ్మ‌గ‌డ్డ శ‌ర‌ణ్య‌ను 2016 లోనే ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్గా నియమించారు.



అప్పుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే ఈ నియామ‌కం జ‌రిగింది. అలా బాబోరు నుంచి ర‌మేష్ కుమార్ అప్ప‌ట్లోనే ఎన్నో మేళ్లు పొందారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి వ‌చ్చింది. ఈ రెండు రుణాలు ఇప్పుడు ఆయ‌న ఇలా తీర్చేసుకున్నారంటూ వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ర‌మేష్ కుమార్‌ను బాగా టార్గెట్ చేస్తోంది. మ‌రి దీనికి వాళ్లు ఏమ‌ని ఆన్స‌ర్ చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: