త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధులు ఢిల్లీ నుంచి వచ్చాకా ఎవ‌రెవ‌రినీ క‌లిశారు అనే దానిపై అధికారులు ఆరా తీయ‌డం ముమ్మ‌రం చేశారు. దేశ వ్యాప్తంగా కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌ర్క‌జ్ మూల‌ల నేప‌థ్యంలోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇటు తెలంగాణ‌లో అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా న‌మోద‌వుతున్న కొత్త కేసుల్లో పూర్తిగా మ‌ర్క‌జ్ మూల‌లే ఉండ‌టం అధికారుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధులు మ‌ర్క‌జ్ వెళ్లి స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్నాక జ‌న‌వ‌రి 20వ శుక్ర‌వారం రోజున ప్రార్థ‌న విశేషాల‌ను వివ‌రించాడానికి కొంత‌మంది మ‌సీదుల‌కు, మ‌రికొంత‌మంది స్వ‌యంగా కొన్ని ఇళ్ల‌ను సంద‌ర్శించి ఢిల్లీ ఆధ్యాత్మిక స‌మావేశ వివ‌రాల‌ను, బోధ‌న‌లను స‌న్నిహితుల‌కు వివ‌రించిన‌ట్లుగా అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. 

 

అయితే త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధులు ఎవ‌రెవ‌రిని క‌లిశారు..ఇలా వీరిని క‌లిసిన వారిలో ఎంత‌మందికి క‌రోనా ల‌క్ష‌ణాలున్నాయి,..వారు తిరిగి ఇంకెంత‌మందిని క‌లిశారు. అనే వివ‌రాల‌ను ఆరా తీసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. మార్చి 11 నుంచి 23 వరకు దిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమైన అన్ని రైళ్ల సమాచారం కావాలని దక్షిణ మధ్య రైల్వే శాఖను  తెలుగు రాష్ట్రాల అధికారులు కోరారు. రైల్వే అధికారులు రెండు రాష్ట్రాలకు ప్రయాణించిన 2.20 లక్షల మంది పేర్లు, చిరునామాలను అంద‌జేశారు. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల‌కు చెందిన పోలీసు, వైద్య అధికారులు నేరుగా ఆ చిరునామాల‌కు  వెళ్తున్నారు. 

 

త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధుల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు, వారు స‌న్నిహితంగా మెదిలిన ఇత‌రుల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌టం  గ‌మ‌నార్హం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతోపాటు ఈ క్ర‌మంలోనే రంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ క‌రోనాతో మరణించిన విష‌యం తెలిసిందే.  బిహారీ యువకులు ఆమె ఇంట్లోనే అద్దెకుండటంతో వారి నుంచే ఆమెకు కరోనా సోకి ఉంటుందని వైద్యులు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు. తబ్లిగీ జమాత్‌ కార్యకర్తలు తిరిగి వచ్చిన రైలులోనే ఈ బిహారీ యువకులు రావడం గ‌మ‌నార్హం.  ప్రైమ‌రీ కాంటాక్టు వైర‌స్ వ్యాధి వ్యాప్తికి ఇది సంకేత‌మ‌ని అధికారులు పేర్కొంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: