ఈరోజు అనగా ఏప్రిల్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ తన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆమె మొట్టమొదటి ప్రసంగం గురించి ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే 2011వ సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గా, శాసన సభ్యురాలు గా వైయస్ విజయమ్మ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ప్రసంగించారు. అది కూడా ప్రభుత్వ అవిశ్వాస తీర్మానం పై ఆమె మాట్లాడవలసి వచ్చింది.


తొలిసారే అంతటి పెద్ద ప్రసంగం ఇస్తున్నప్పటికీ... తాను చెప్పాల్సింది ఏమాత్రం తడబడకుండా బెరుకు లేకుండా విజయమ్మ చెప్పేశారు. ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు ఆరోపణలు ఎదురుదాడి ఇలాంటివి ఆమె తన ప్రసంగంలో ఇమిడ్చారు. తన ప్రసంగంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పథకాలను కూడా చాలా స్పష్టంగా గుర్తు చేశారు,


తన మొట్ట మొదటి అసెంబ్లీ ప్రసంగం ఆరంభించినప్పుడు వైఎస్ విజయమ్మ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ వైయస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో పులి లాగ ప్రసంగిస్తుంటే... ఇంట్లో ఎంతో సంబరపడుతూ తాను చూసేదానినని కానీ విధి వక్రీకరించి తాను అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని ఆరంభించిన వైయస్ విజయమ్మ మొదటి లో కాస్త తడబడినా తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ దాడి చేశారు.


భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టని సంక్షేమ పథకాలను తన భర్త వైయస్ రాజశేఖర్రెడ్డి పెట్టారని ఆమె తెలిపారు. అసలు కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది వైయస్ రాజశేఖర్ రెడ్డే అని ఆమె గుర్తు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పులివెందుల‌లో ఆవిడ కంటే రాజ‌కీయ ఉద్దండులు చంద్ర‌బాబు, కిర‌ణ్‌కుమార్ రెడ్డి, ఇలా పెద్ద పెద్ద వాళ్లు అయినా బెద‌ర‌కుండా అసెంబ్లీలో ప్ర‌సంగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: