తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలపై ఇప్పుడు ఎమ్మెల్యేలలో కూడా అసహనం పెరిగిపోతోంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా తాను ఎంతో బలంగా ఉన్నాను అని పదేపదే చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాత్రం ప్రజల్లో చులకన అయిపోయారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై ఎమ్మెల్యేలు కూడా పైకి చెప్పలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు.

క్షేత్రస్థాయిలో కూడా కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే తప్పులు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. ఇక ఎమ్మెల్యేల సమస్యలను కూడా సీఎం కేసీఆర్ వినకపోవడంతో చాలా మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది అంటున్నారు. అయితే ఇప్పుడు వరంగల్ కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ఇబ్బందులు పడవచ్చు అని అంచనాలున్నాయి.

వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ ఈ జిల్లాల్లో కూడా ఇప్పుడు తెరాసని ప్రజలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్తున్నారు సరే... అయినా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ వద్ద కు వెళ్లకపోవడం అంతేకాకుండా ఈ రెండు జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదు. తాగునీరు సాగునీరు విషయంలో మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ముందు ఉండటంతో తెలంగాణ ప్రజలలో ఆగ్రహం పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో బండి సంజయ్ త్వరలో సమావేశం అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: