పాలు తాగడం వలన పిల్లలకు పెద్దలకు ఇద్దరికి మంచిదే.ఎందుకంటే పాలలో అనేక రకాలయిన పోషక పదార్ధాలు ఉన్నాయి. అవి మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి  అయితే మనం నిత్యం తాగే పాలు ఎంతవరకు మంచివి అని ఎవరన్నా ఆలోచించారా.. అసలు మనం తాగే ప్యాకెట్ పాలు ఎంత వరకు మన ఆరోగ్యానికి సురక్షితం అనే ప్రశ్న చాలా మందిలో వచ్చే ఉంటుంది. ఇలా ఎందుకు అంటున్నామంటే  ఈ మధ్యకాలంలో మనం తినే ప్రతి వస్తువు కూడా కల్తీ అవుతుంది. చివరకు  పండ్లు, నూనె, అల్లం, పసుపు,గుడ్లు, బియ్యం,  పాలు ఇలా మనం తినే అన్నీ పదార్ధాలు కల్తీకి గురించి అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రాసెస్‌ చేసిన పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వలన ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.




మనం వాడే ప్యాకెట్‌ పాలకు కారణమయ్యే పాలపొడిని ఈ విధంగా తయారుచేస్తున్నారు. మొదటగా సెంట్రిఫ్యూజ్‌ అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్లు, కొవ్వు, నీటిని వేరుచేస్తారు.ఇల వేరుచేసిన కొవ్వును ఐస్‌క్రీమ్‌ కంపెనీలకు అమ్ముతారు.మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి పాశ్చరైజేషన్‌ ద్వారా అందులోని సూక్ష్మ జీవులను చంపేసి పాలపొడిని  తయారుచేస్తారు. చిన్న రంధ్రం ద్వారా ఎక్కువ ఒత్తిడితో పాలను గాలిలోకి పిచికారి చేస్తారు ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోకి నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్‌ అవుతుంది.ఇలాంటి పాలను మనం తాగడం వలన శరీరంలోని రక్తనాళాలు  తొందరగా మూసుకుని పోయి  గుండె, రక్తనాళాల జబ్బులకు కారణమవుతుంది. 




ప్యాకెట్‌ పాలను కొన్ని రోజుల పాటు విరగకుండా,  నిల్వ ఉండేందుకు గాను వాటిలో  పోర్సిలిన్‌ అనే రసాయనాలను కలుపుతారు. అవి మానవ శరీరంలో తీవ్రస్థాయి నష్టాలను కలిగిస్థాయి. అలాగే  కృత్రిమ పాలు అయితే మరి డేంజర్. ఒకరి లాభానికి పోయి ఇలా కృత్రిమ పాలు తయారు చేయడం వలన ఎంతో మంది ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. యూరియా, ఇతర రసాయనాల ద్వారా కృత్రిమ పాలను తయారుచేస్తున్నారు. ఈ కృత్రిమ పాలను  చిన్న పిల్లలకు గనుక తాగిస్తే వాళ్లకు  వాంతులు, వీరేచనాలతో పాటు  అస్వస్థతకు గురవుతారు. అంతేకాకుండా చిన్న వయసులోనే జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి. అలాగే క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వచ్చే  అవకాశముంది.అందుకనే మీరు తాగే పాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.. !



మరింత సమాచారం తెలుసుకోండి: