ఏపీలో జ‌రుగుతోన్న ప‌ట్ట‌ణ ఎన్నిక‌ల్లో నేటితో ప్రచారానికి తెర ప‌డ‌నుంది. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  పాలక, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం జ‌రుగుతోంది. పార్టీల మ‌ధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతుండగా... ఇవాళ్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5.00గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు.  ఆ త‌ర్వాత మైకులు మూగ బోనున్నాయి. ఇక, ఎల్లుండి రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

మూడు రోజుల గ్యాప్ అనంత‌రం ఈనెల 14న ఓట్లను లెక్కించనున్నారు. 13వ తేదీన ఎక్క‌డైనా రీ పోలింగ్ అవ‌స‌రం అనుకుంటే నిర్వ‌హిస్తారు. ఇక మొత్తం ఎన్నిక‌లు జ‌రుగుతోన్న చోట్ల  పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.  డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో... ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.  మొత్తంగా ఇవాళ ప్రచారానికి తెరపడినా.. సైలెంట్‌గా ప్రలోభాల పర్వానికి తెరలేపేందుకు రాజ‌కీయ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.

ప్ర‌చారం ముగుస్తోన్న ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ త‌ర‌పున పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌కు కూడా వైసీపీ కండువాలు క‌ప్పేస్తోంది. అటు జ‌న‌సేన నుంచి కార్పొరేట‌ర్లు.. కౌన్సెల ర్లుగా పోటీలో ఉన్న వారు సైతం అధికార పార్టీ ప్ర‌లోబాలు, ఒత్తిళ్లకు త‌లొగ్గి ఆ పార్టీ కండువాలు క‌ప్పేసుకుంటున్నారు. మొత్తంగా గ‌త ప‌ది రోజుల నుంచి హోరాహోరీగా కొన‌సాగుతోన్న ప్ర‌చారం నేటితో ముగియ‌నుంది. మ‌రి ఎవ‌రి జాత‌కాలు ఏంటో ఈ నెల 14న తేలి పోనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: