జగన్ బయట ఉంటే చాలా కష్టమని చాలా మందికి ఉంది. ఇక జగన్ అరవీర భయంకరుడుగా కూడా కొందరు రాజకీయ ప్రత్యర్ధులకు కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ బెయిల్ జైలూ అంటూ వస్తున్న వార్తలు ఇపుడు వైసీపీలో కలవరం రేపుతున్నాయి.

జగన్ బెయిల్ ని ఎందుకు రద్దు చేయరు అంటూ సీబీఐ కోర్టులో వైసీపీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశాడు. మొదట సరిగ్గా పత్రాలు లేవు అంటూ తిరస్కరించిన కోర్టుకు తిరిగి అన్ని పత్రాలు సమర్పించాడు. దీంతో కోర్టు దీని మీద విచారణకు స్వీకరించింది.

ఈ నేపధ్యంలో విచారణ కూడా ఈ నెల 22 నుంచి మొదలుపెట్టనుంది. జగన్ బెయిల్ రద్దు మీద విచారణకు రాజు కూడా చాలా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆయన సుప్రీం కోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాదులను నియమించుకుంటారని చెబుతున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్ బెయిల్ రద్దు కావాలి. ఆయన జైలుకు కి పోవాలి ఇదే రెబెల్ ఎంపీ రాజు గారి ఆలోచన.

మరి సీబీఐ కోర్టులో ఈ నెల 22 నుంచి జరిగే విచారణ ఏ విధంగా ఉంటుంది. ఏయే మలుపులు తీసుకుంటుంది అన్నది కూడా చూడాలి. జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడు అన్నది రాజు ప్రధాన అభియోగం. దానికి తగిన సాక్ష్యాలను కూడా ఆయన ఏర్చి కూర్చి మరీ పిటిషన్ తయారు చేశారు. మొత్తానికి జగన్ కి ఈ విషయంలో కోర్టులో ఏ రకమైన షాక్ తగులుతుంది అన్నది అంతటా చర్చగా ఉంది. మరి జగన్ ఈ విషయంలో ఏ చేయబోతారు అన్నది కూడా చూడాల్సిన అంశమే. ఏపీలో అన్ని ఎన్నికలు అయిపోయాయి.ఇక పాలన మీద దృష్టి సారిస్తాను అని జగన్ భావిస్తున్న వేళ రఘురామ క్రిష్ణంరాజు ఇలా పావులు కదపడం విచిత్రం. మరి దీని వెనక ఎవరు ఉన్నారో సూత్రధారులు ఎవరో కూడా చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: