జగన్ ప్రధాని ? మరో ఫ్రంట్ ఏర్పడితే.. ! ఇలాంటివి వినిపిస్తున్నాయ్ మీడియాలో....ఏ మాటకు ఆ మాట...ప్రజలకు బీజేపీ అంటే కోపం ఉంది,,ధరలు పెరుగుతున్న ప్రతిసారీ కోపం ఉంది...కానీ మోడీని ఒంటరి చేసేంత కోపం దేశంలో లేదు...ఇక జగన్ ప్రధాని అవుతారా లేదా అన్నది వెరీ హైపోథిటికల్ కానీ కలలు ఉండడం తప్పేం కాదు ఈ కల కేసీఆర్ కూ ఉంది.. స్టాలిన్ కు కూడా ఉండొచ్చు ఎవరికి ఎరుక .....




కాంగ్రెస్ కు కష్టాలున్నాయి ..సీపీఐకు సీపీఎంకూ కష్టాలున్నాయి ..డబ్బుల్లేని రోజుల్లేని  పార్టీలు చాలా ఉన్నాయి కానీ కాస్తో కూస్తో మేలేజ్ ఉన్న పార్టీ వైస్సార్సీపీ.. కనుక రానున్న కాలంలో జగన్ ను ప్రధాని చేయాల్సిందే.. అంటున్నారు కొందరు.. వినేందుకు హాయిగా జగన్ అభిమానులకు ఉన్నా అది సాధ్యం కాని వ్యవహారం అన్నది సుస్పష్టం..ఇలాంటి తరుణంలో మరో ఫ్రంట్ తెరపైకి వస్తుందా? లేదా అన్నది డైట్ .. కాంగ్రెస్ కు జాతీయ పార్టీ హోదా త్వరలో పోతుందని కొందరు అంటున్నారు. శిరోమణీ అకాలీ దళ్ లాంటి నేతలు అంటున్నారు.. అందుకే ఆయన నేషనల్ ఫ్రంట్ ఆశలు మోస్తున్నారు. ఆ ఆశల సాధన కోసం కొత్త ఆశయం ఒకటి తెరపైకి తెస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ గత సార్వత్రిక ఎన్నికల్లో చాలా చోట్ల బోణీ కొట్టనందున డీలా పడిపోయింది.. అంతర్గత కలహాలు ఉండనే ఉన్నాయి.. ఇప్పుడు కొత్త ఫ్రంట్ వచ్చి  కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీల శక్తులను కూడితే వచ్చేదెంత పోయేదెంత అన్నది ఓ ప్రశ్న. తాము ఏర్పాటు చేయబోయే నేషనల్ ఫ్రంట్ బీజేపీని ఎదుర్కోనుందన్న మాట ప్రకాశ్ సింగ్ బాదల్ వినిపిస్తున్నా అది ఇప్పట్లో సుసాధ్య కాకపోవచ్చని ఒకవేళ అన్ని రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీని ఏకం చేసినా కార్పొరేట్ శక్తుల మద్దతుతో ఆ పార్టీకి ఇప్పట్లో ఢోకా ఉండదని కొన్ని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పోనీ కొత్త ఫ్రంట్ తమ నేతగా జగన్ ను ప్రకటించినా ప్రాక్టికల్ గా అది వర్కౌట్ కాదు.. జగన్ కేసీఆర్ కలిసి పనిచేసినా బీజేపీని ఢిల్లీ రాజకీయాల్లో ఒంటరిని చేయడం సాధ్యం కాని పని.. కనుక జగన్ ను ప్రధాని చేయాలన్న కలను వదిలేయడం బెటర్ అని అంటున్నారో సీనియర్ జర్నలిస్టు.. అది కుదరదు కానీ దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీలు ఏకమయి నిధుల విషయమై పోరాడితే కాస్త ఫలితం ఉంటుందని కానీ ఈ పని చెయ్యకుండా ప్రధాని  కావాలన్న కలలు కనడం ఎవ్వరికీ భావ్యం కాదని అంటున్నారు పరిశీలకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: