ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటన గత కొంత కాలం నుంచి ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తానంటూ కేంద్రం ప్రకటించడాన్ని అటు ఏపీ రాజకీయ నేతలందరూ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎంతో మంది కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక నిరసనలు కూడా చేపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఓవైపు స్టీల్ ప్లాంట్ ఎక్కడ ప్రైవేటీకరణ జరుగుతుందో అని ఏపీ ప్రజలందరూ భయ పడి పోతూ ఉంటే అటు చంద్రబాబు ఇటు జగన్ పార్టీ నేతలు మాత్రం ఈ విషయంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.


 ప్రస్తుతం ఇరు పార్టీల ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పార్లమెంటులో గళం విప్పకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేసుకుంటూ ఉండడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష అధికార పక్షం అనే విషయాన్ని పక్కన పెట్టి...  ఇక ఏపీకి తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అంటూ కోరుతున్నారు అందరూ. ఇక ఇటీవల ఇదే విషయాన్ని అటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.  ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన సిపిఐ రామకృష్ణ జగన్ చంద్రబాబు పార్టీలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో మొండిగా వ్యవహరిస్తోంది అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీకి తలమానికమైన స్టీల్ ప్లాంట్ గురించి అటు ఏపీ ఎంపీలు అందరూ పార్లమెంటులోనూ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి వైసిపి నేతలు రాజకీయాలు మాని స్టీల్ప్లాంట్ విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు . గంగవరం పోర్టును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు. ఇక ఈ విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్న అవాస్తవాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామకృష్ణ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap