ఉండటానికి వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఆ 22 మంది ఎంపీల వల్ల రాష్ట్రానికి ఇంతవరకు వచ్చిన ప్రయోజనం ఏది లేనట్లే కనిపిస్తోంది. ఏదో జగన్ గాలిలో చాలామంది ఎంపీలు గెలిచేశారు. సరిగా పేర్లు తెలియకుండానే జగన్ బొమ్మ చూసి ప్రజలు వైసీపీని గెలిపించేశారు. మరి అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఆ ఎంపీలు, ఆయన ఇమేజ్ నిలబెట్టేలా పనిచేస్తున్నారా? అంటే చెప్పడం కష్టం. అసలు ఎంతమంది సరిగ్గా పనిచేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది.

అసలు ఢిల్లీలో ఎంతమంది ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడారో కూడా తెలియడం లేదు. టి‌డి‌పికి చెందిన ముగ్గురు ఎంపీలు ఏదొక సందర్భంలో రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతున్నట్లు కనిపిస్తున్నారుగానీ, వైసీపీ ఎంపీలు మాత్రం రాష్ట్రం కోసం పెద్దగా గళం విప్పిన సందర్భాలు మాత్రం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదో మిథున్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్...మరో ఒకరిద్దరు ఎంపీలు తప్ప మిగిలిన వారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. కొద్దో గొప్పో రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు సైతం రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారు గానీ, మిగిలిన వైసీపీ ఎంపీలు మాత్రం కనబడటం లేదని అంటున్నారు. ఇటు వారి పార్లమెంట్ స్థానాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కూడా ఎంపీలు వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అయితే అలాంటి ఎంపీలకు ఈ సారి జగన్ షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఈ సారి కొంతమంది ఎంపీలని సైడ్ చేసి కొత్తవారికి ఎంపీ టికెట్లు ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటికే 8 మంది పైనే ఎంపీలపై ప్రజా వ్యతిరేకత వచ్చినట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇక అలాంటి వారిని జగన్ వచ్చే ఎన్నికల్లో పక్కనబెట్టేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: