నిరుద్యోగులకు ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ గుడ్ న్యూస్ చెబుతోంది. త్వరలోనే రెండు లక్షల గ్రామాలకు తమ సేవలను విస్తరించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అదీ 18 నుండి 24నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తమ సంస్థలో 2వేల 500మందిని నియమించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.  దేశవ్యాప్తంగా ఉండే గ్రామాల్లో చాలా వరకు కొత్తగా బ్యాంక్ సేవలు అందించే అవకాశాలున్నట్టు చెబుతోంది హెచ్ డీ ఎఫ్ సి. తాజాగా హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు వారు ప్రయత్నాల్లో మునిగిపోతున్నారు.

దేశవ్యాప్తంగా విద్యావంతులు పెరిగిపోతున్నారు. అందుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కరువయ్యాయి. దీంతో నిరుద్యోగుల శాతం కూడా నానాటికీ పెరిగిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వందలు, వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే లక్షల సంఖ్యలో విద్యావంతులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో కొంతవరకు ప్రైవేట్ కంపెనీలు ఆలోటును భర్తీ చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా కంపెనీలు లక్షలాది మందిని ఉద్యోగం నుండి తొలగించాయి. అవసరం ఉన్నంత వరకు మాత్రమే నియమించుకోవడంతో పాటు.. ఆఫీసు ఖర్చులు తగ్గించుకునేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి తెరలేపాయి.

పెద్దపెద్ద చదువులు చదివిన వారు..  ఏ చిన్న ఉద్యోగం దొరికినా అందులో ప్రవేశిస్తున్నారు. కుటుంబాన్ని నడిపేందుకు ఆ ఉద్యోగాల్లో సర్ధుకు పోతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పటికే దాదాపు 600జిల్లాల్లో సూక్ష్మ, మధ్య తరహా సంస్థలకు చేయూతనందిస్తోంది. అంతేకాదు పంట, వాహనాలు, ఇళ్లు, బంగారంపై రుణాలు అందిస్తోంది. గ్రామస్థాయిలో వస్తున్న మార్పులను ఉద్దేశించి.. అక్కడ బ్యాంక్ సేవలు విస్తరించేందుకు పూనుకుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పూర్తి మార్పులు చోటుచేసుకుంటాయని హెచ్ డీఎఫ్ సీ అభిప్రాయపడుతోంది. మొత్తానికి హెచ్ డీఎఫ్ సీ ప్రకటన నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: