ఏపీలో నిధుల వేట సత్ఫాలితాలను ఇస్తున్నట్టే ఉంది. దానికోసం రాష్ట్రంలో ఖనిజ నిక్షేపాల వేట ప్రారంభించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనేక చోట్ల సదరు అధికారులు పరీక్షలు చేసి మొత్తానికి ఫలితం సాధించారు. దీనితో ఆయా నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో పది చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాదాపు ఇవన్నీ రాయలసీమ ప్రాంతమైన అనంతపురంలో నే ఉండటం గమనార్షం. ఇక్కడ  మండల కేంద్రం రామగిరిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి అవి స్వాధీనం చేసుకున్నారు. అవి అయిపోవడంతో అక్కడ 2001 నుండి తవ్వకాలు ఆపేశారు. ఇప్పుడు దీనికి సమీపంలోనే మరో రెండు అలాంటి నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం రొద్దం మండలం భోక్సం పల్లిలో రెండు చోట్ల, కదిరి మండలం జౌకుల పరిధిలో ఆరుచోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. అయితే మొత్తం పది ప్రాంతాలలో 97.4 చ.కి. పరిధిలో నిక్షేపాలు ఉన్నాయని అధికారులు నివేదికలో పొందుపరిచారు. ఈ ప్రాంతాలలో దాదాపు 50 మీటర్ల లోతుకు వెళ్లేకొద్దీ ఈ నిక్షేపాలు దొరుకుతాయని అధికారులు తెలిపారు. అంటే తన్ను తవ్వితే 4గ్రాముల బంగారం దొరుకుతుందని వారు తెలిపారు. జౌకులలో అన్ని ప్రాంతాలలో  కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, భోక్సం పల్లిలో రెండు  టన్నులు కలిపి మొత్తం 16 టన్నుల బంగారు నిక్షేపాలు ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు.

ఆయా ప్రాంతాలలో భూగర్భ తవ్వకాల ద్వారా ఈ నిక్షేపాలు వెలికితీయవచ్చు అని సూచించారు అధికారులు.  ప్రస్తుత బంగారం మార్కెట్ ధరలను బట్టి ఇక్కడ తవ్వకాలు గిట్టుబాటు అవుతుందని వారు తెలిపారు. అలాగే రాష్ట్రంలో మరో తొమ్మిది చోట్ల బేస్ మెటల్, కాపర్, గోల్డ్, మాంగనీస్, వజ్రాలు, ఇనుప ఖనిజాలు గుర్తిచినట్టు అధికారులు తెలిపారు. ఆయా నివేదికలను వీరు కేంద్రానికి అందించారు. అలాగే ఇతర ఖనిజాల కోసం అన్వేషణ కోసం ఆయా ప్రాంతాలలో అనుమతులు కూడా ఇవ్వనున్నారు. ఈ ఖనిజ నిక్షేపాలు తవ్వకాలకు లైసెన్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో సంస్థకు 1000 హెక్టార్ల వరకు లైసెన్స్ ఇస్తారు. పూర్తిస్థాయి నిక్షేపాలు గుర్తించిన చోట మైనింగ్ లీజుకు  ఇస్తారు. దీనికోసం ఈ వేలం నిర్వహించనున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: