మా ఉద్దానం నేలలతో ఆయనకు అనుబంధం ఉంది
ఇక్కడే కొద్ది రోజులు ఆయన గడిపారు కూడా!
అదేవిధంగా మా ప్రాంతం వెనుకబాటుపై ఆయనకు అవగాహన ఉంది
మంచి వ్యక్తి, మా ప్రాంత నేతలను గౌరవించిన మంచి మనిషి
ఆ విధంగా ధర్మాన కానీ బొత్స కానీ ఆయనకు చేరువ.
పేరుకు గుంటూరు స్వస్థలం అయినా అన్ని ప్రాంతాలపైనా ప్రేమ ఉంది అనేందుకు
ఆర్థిక మంత్రి హోదాలో చేసిన కేటాయింపులే తార్కాణం. వైఎస్ ను వారించినా కూడా
కొన్ని మంచి పనులకు మాత్రం నిధులు సమకూర్చి భేషజాలు లేని రుజువర్తనలో ఉన్న
రాజకీయం ఒకటి నడిపారు ఈ పెద్దాయన.
మాజీ ముఖ్యమంత్రి అని రాయడం కన్నా మాజీ గవర్నర్ అని రాయడం కన్నా నిబద్ధత ఉన్న కాంగ్రెస్ కార్యకర్త అని ఆయన గురించి రాయడమే గొప్ప విషయం. అదే అర్హతకు తూగే విషయం. రోశయ్య నిబద్ధతకూ క్రమశిక్షణకూ మారుపేరు. తెలివైన కోమటి. సమర్థుడయిన ఆర్థిక మంత్రి. ఆర్థిక వేత్త అని కూడా రాయొచ్చు కానీ ఇంకాస్త ఆయనకు పరిణితి ఉంటే ఆ పదం కూడా ఆయనదే కావొచ్చు. అయినా కూడా వైఎస్ చెప్పినవన్నీ ఆయన చేయడానికి ఎంతో ఓర్పు వహించారు. నిధుల సర్దుబాటుకు ఎన్నో దారులు వెతికారు. అయినా కూడా తన సోదరుడు చెప్పిన మాటకు ఏనాడూ ఎదురు చెప్పలేదు. వయసు రీత్యా ఆయన చాలా పెద్దవారు. వారిని గౌరవించడం మన బాధ్యత అని మాత్రమే అన్నారు వైఎస్. ఆ విషయమై రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఇవాళ్టికీ అదే గౌరవం రోశయ్య విషయమై ఉంది.
- రత్నకిశోర్ శంభుమహంతి
ఫొటో : డీసీసీబీ మాజీ చైర్మన్ నర్తు నరేంద్ర యాదవ్ సర్ fb వాల్ నుంచి