ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా కరోనా గురించే మాట్లాడుతున్నారు. చైనా వుహాన్ నగరం నుండి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ ఎందరి జీవితాలనో రోడ్డున పడేసింది. 2020 నుండి పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ పేరిట మనపై దండయాత్ర చేస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కరోనా కారణంగా కంపెనీలు వర్క్ ప్రం హోమ్ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ విధానం పట్టణాలలో వారికి సెట్ అయినా, గ్రామాలలో ఉన్న వారికి కొత్త సమస్యలను తెచ్చింది. కంపెనీ వర్క్ చేయడానికి సరిపడా ఇంటర్నెట్ సౌకర్యం పల్లెల్లో లేకపోవడంతో ఎందరో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ సమస్యను రూపు మాపడానికి ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకోసం ఏపీ లోని ప్రతి గ్రామంలో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ లను మరియు ఇంటర్ నెట్ లను నెలకొల్పనున్నారు. ఈ విధానం ద్వారా ఎందరో ఉద్యోగులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతీ యువకులకు ఉపయోగం కానుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో ఒక సమీక్ష నిర్వహించారు.  ఈ డిజిటల్ లైబ్రరీ విధానాన్ని ముందుగా చెప్పిన విధంగా మూడు విడుతలుగా పూర్తి చేయనున్నారు .

అందులో భాగంగా ఇప్పటికే ఒక విడుత పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండవ విదుత మొదలు కావాల్సి ఉంది. ఈ విడుతలో మొదటి విడుతలో పెండింగ్ లో పడిన డిజిటల్ లైబ్రరీ లను సైతం పూర్తి చేస్తారు అని సీఎం జగన్ ఈ సమీక్షలో తెలిపారు. ఈ డిజిటల్ లైబ్రరీ లో ఇంటర్నెట్, స్టడీ మెటీరియల్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, డెస్క్ టాప్, యుపిఎస్, బార్ కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, లాంటి ఉద్యోగులు మరియు పోటీ పరీక్షలు సన్నద్ధం అయ్యే వారికి అవసరం అయిన అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను జూన్ 2023 నాటికి పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తారు. వాస్తవంగా ఈ సమీక్ష యువతీ యువకులకు ఒక శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: