తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అచ్చం ఏపీలో ఉన్న రాజకీయాల తరహాలోనే ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదే సమయంలో కెసిఆర్ ఓడిపోవడం కారణంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు భిన్నంగా తయారయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎపిసోడ్ చాలా భిన్నంగా తయారయింది.

 తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత... వెంటనే పార్టీ కండువా మార్చారు దానం నాగేందర్. గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కేటీఆర్ తో పాటు కేసీఆర్ పై... పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అసలు గులాబీ పార్టీ తెలంగాణలో ఉండబోదని.. ఆ పార్టీలో కుటుంబం మాత్రమే మిగులుతుందని బాంబు పేల్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దానం... ప్లేట్ మార్చాడు.

 కెసిఆర్ జపం చేస్తున్నాడు దానం నాగేందర్. కెసిఆర్ 27వ తేదీన నిర్వహించబోయే  భారీ బహిరంగ సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు అడుగడుగున స్కెచ్ లు వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దానం నాగేందర్ మాత్రం చాలా భిన్నంగా స్పందించారు.  కెసిఆర్ బయటకు రావాలని జనాలు అంతా కోరుకుంటున్నారు... ఆయన బయటకు వస్తే నేను కూడా చూడాలని అనుకుంటున్నా.. ఆయన గ్రేట్ లీడర్ అంటూ దానం నాగేందర్ బాంబు పేల్చారు.

 ఈ ఎపిసోడ్ లోనే కాకుండా స్మిత సబర్వాల్ ఎపిసోడ్లో కూడా... రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించారు. 2000 మంది... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో పోస్టులు పెడితే కేవలం స్మితా సబర్వాల్ కు నోటీసులు ఎలా ఇస్తారని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు.  స్మితా సబర్వాల్ తప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడారు.  అటు హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో బై ఎలక్షన్లు వస్తే... తనకు కాకుండా... వేరే వ్యక్తికి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారని దానం నాగేందర్  ఇలా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: