దేశంలో hiv కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేఘాలయలో పెళ్ళికి ముందు హెచ్‌ఐవి (HIV) టెస్ట్ తప్పనిసరి కాదు. అయితే, రాష్ట్రంలో పెరుగుతున్న హెచ్‌ఐవి కేసులను దృష్టిలో ఉంచుకొని, పెళ్ళికి ముందు హెచ్‌ఐవి టెస్ట్ తప్పనిసరి చేసే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని మేఘాలయ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది.

ఆరోగ్య మంత్రి అంపరీన్ లింగ్‌డోహ్ ఇటీవల మాట్లాడుతూ, గోవాలో పెళ్ళికి ముందు హెచ్‌ఐవి టెస్ట్ తప్పనిసరి చేసినట్లుగా, మేఘాలయ కూడా అలాంటి చట్టాలను రూపొందించాలని కామెంట్లు  చేశారు.  ఈ విషయంపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి, కొత్త విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఈ చట్టం అమలులోకి వస్తే, పెళ్ళికి ముందు హెచ్‌ఐవి టెస్ట్ తప్పనిసరి చేసిన రెండవ రాష్ట్రంగా మేఘాలయ నిలుస్తుంది.

కాబట్టి, ప్రస్తుతానికి ఇది తప్పనిసరి కానప్పటికీ, త్వరలో చట్టం మారే అవకాశం ఉంది. పెళ్ళికి ముందు hiv పరీక్ష చేయించుకోవడం  మంచిదని చెప్పవచ్చు.  పెళ్ళికి ముందు కొన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సమస్యలను సులువుగా అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది.  ఈ నిర్ణయం వల్ల సమాజానికి ప్రయోజనం కలుగుతుందని మేఘాలయ సర్కార్ భావిస్తోంది.

సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించడం వల్ల రోగులకు సైతం సత్వర చికిత్స అందుతుందని  మంత్రి అంపరీన్ తెలిపారు.  మేఘాలయ సర్కార్ ఈ నిబంధన దిశగా అడుగులు  వేస్తే  ఇతర రాష్ట్రాలు సైతం ఈ నిబంధనను అమలు చేసే ఛాన్స్ అయితే   కచ్చితంగా ఉంటుంది.  భాగస్వామికి ఇబ్బందులు కలగకుండా మేఘాలయ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: