ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేప్,అట్రాసిటీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానాల్లో నిలుస్తుందని  జాతీయ ఎస్సీ కమీషన్ మెంబర్ రాములు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అధికారులు కూడా అట్రాసిటీ కేసులను నీరు కార్చుతున్నారని ఆరోపించారు. కస్తూరిబాయ్ పేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడారు. రెండు మామిడి కాయలు కోసిన నేరానికి విద్యార్థులను మర్దర్ చేస్తున్నారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇటీవల ఈ సఃఘటన అమలాపురంలో జరిగిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుంటూరులో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించడాన్నిరాములు తీవ్రంగా పరిగణించారు.


రాష్ట్రంలో చట్టబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకే రక్షణ కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాను శుక్రవారం గుంటూరులో పర్యటించనున్నట్టు రాములు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను 10 వ సారి పర్యటన చేస్తున్నానని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు  విధ్యే ముఖ్యమన్నారు. పేద విద్యార్థులకు అస్తులు లేకపోయినప్పటకీ వారికి  విద్యే  ఆస్తి అని రాములు స్పష్టం చేశారు. భోజనం కోసం అయినా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు వారి తల్లిదండ్రులు పంపుతున్నారని చెప్పారు. ఒక్కో హాస్టల్ కు నెలకు 2లక్ష ల50 వేలు ఖర్చు చేస్తున్నామని రాములు తెలిపారు. ప్రేవేటు స్కూల్ లలో  10వేల రూపాయల  జీతాలతో  టీచర్స్ పని చేస్తున్నారు.



ప్రభుత్వ పాఠశాలల్లో  పని చేసే ఉపాధ్యాయులు ఉత్తీర్ణత ఫలితాల విషయంలో వెనకబడి ఉన్నారు. ప్రయివేట్ స్కూల్స్ రిజల్ట్స్ తో పోటీపడాలన్నారు. కార్పొరేట్ విద్యార్థులు ఇంగ్లీష్ ఎక్కువ నేర్చుకున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ 1వ తరగతి నుంచి ఇంగ్లీషు ఎర్పాటు చేశారని ప్రశంసించారు. హాస్టల్ లలో త్రాగునీరు సమస్య, దోమల బెడద ఉందన్నారు. 30 నుంచి 40 మంది ఒకే రూమ్ లో నిద్రపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ఆట స్థలం ఎర్పాటు చేయాలన్నారు. కిచెన్, సరిగా లేదు ఆహరం నుకాలుగా ఉందని మండిపడ్డారు. హాస్టల్లో వసతులు ఉంటే విద్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ని 86 హాస్టల్లో ఇదే దుస్తుతి నెలకొందన్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: