బతకమ్మ పండగ వస్తుందంటే తెలంగాణ ఆడపడుచులు ఆశించేది ఏంటంటే బతుకమ్మ చీరలు.ప్రతి ఇంటికి పంపిణి చేసే ఈ చీరలు ఇంతకు ముందు వివాదాల్లో చిక్కుకున్నప్పటి నుండి కాస్త ఫర్వాలేదు అనే స్దాయికి వచ్చాయి.ఇక తెలంగాణ గవర్న మెంట్ ఈ చీరలు ఆడపడుచులకోసం తయారు చేసి రెడిగా పెట్టుకుంది.ఈ సందర్భంగా ఎప్పటినుండి వీటి పంపకాలు జరుగుతాయో కూడా వెల్లడించింది.



ఇక పోతే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఆడపడుచు కానుకగా చీరెలను అందజేయడంతోపాటు,మరమగ్గ కార్మికులకు ఉపాధి కల్పించే ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .రాష్ట్రవ్యాప్తంగా 18 ఏండ్ల పైబడిన మహిళలందరికీ చీరెలు అందజేయనున్నారు.,ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.313 కోట్లు వెచ్చించిందట.ఇక ఈ బతుకమ్మ చీరెల ద్వారా 16 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి దొరకగా,26 వేల మరమగ్గాల ద్వారా వీటిని తయారుచేయిస్తున్నారు.ఈ ఏడాది 10 రకాల డిజైన్లు,10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరెలను పంపిణీ చేయ డానికి సిద్ధంగా ఉంచినట్టు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.పండగ దగ్గర పడుతుంది కాబట్టి అన్ని జిల్లాలకు చీరెలను చేరవేసినట్టు వెల్లడించారు.



గతంలో మరమగ్గ కార్మికులకు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేలు మాత్రమే దక్కేదని..కానీ బతుకమ్మ చీరెల తయారీ తర్వాత రూ.16వేల నుంచి రూ.20వేల వరకు లభిస్తున్నదని.బతుకమ్మ చీరెల కోసం ప్రభుత్వం మూడేండ్లలో రూ.715 కోట్లు కేటాయించిం దని వెల్లడించారు.ఇక ఆడపడుచు కానుకగా రాష్ట్రప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరెలను ఈ నెల 23 నుంచి అందజేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,మున్సిపల్‌శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,జెడ్పీ చైర్మన్లు,స్థానిక సంస్థల ప్రతినిధులు వీటి పంపిణీని అన్ని నియోజకవర్గాల్లో  23 నుంచి ప్రారంభిస్తారని చెప్పారు.ఇంకేంది ఓ తెలంగాణ ఆడపడుచులు చీరెలు కట్టుకుని జోర్దార్‌గా చప్పట్లు కొడుతూ బతకమ్మ పండగ ఆడుండ్రి లేకుంటే సార్లు ఊరుకోరు..


మరింత సమాచారం తెలుసుకోండి: