ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో ప్రజలు తినడానికి సరిపడా తిండి లేక క్షుద్భాధతో కొట్టుమిట్టాడుతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు 80శాతం వరకూ ఆఫ్రికాలోనే ఉన్నట్లు తెలిపింది. పంటలు, ఆహార పరిస్థితులు పేరిట ఐరాస ఆహరం, వ్యవసాయం విభాగం ఓ నివేదికను విడుదల చేసింది. ఆ వివరాలు...


ఇరాన్, సిరియా, యెమెన్, సోమాలియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాల్లో చోటుచేసుకుంటున్న అల్లకల్లోల పరిస్థితులు ఈ దేహ్స్స్ల వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఘర్షనల ప్రభావం పొరుగునున్న దేశాలకు విస్తరిస్తోంది. శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడం, వారితో ఆహార వనరులను పంచుకోవడం వల్ల అక్కడా ఆహార సంక్షోభం ఏర్పడుతోంది.

సెంట్రల్ ఆఫ్రికాన్ రిపబ్లిక్ లో ఘర్షణ వల్ల దాదాపు లక్ష మందికి పొరుగున ఉన్న కాంగో ఆశ్రయమిస్తోంది. తూర్పు ప్రాంతాల్లోని అల్ల కల్లోల పరిస్థితులు మరో 15 లక్షల మంది వేర్వేరు ప్రాంతాలకు తరలివెళ్లేందుకు కారణమయ్యాయి. మరోవైపు ఎల్ నినో ప్రభావంతో మరో 5 లక్షల మంది వలస బాట పట్టారు.

ఆహార కొరతను అధిగమించేందుకు బయట దేశాల నుంచి సాయం తీసుకొనే దేశాల సంఖ్య గత ఏడాది డిసెంబర్ నాటికి 33 కి పెరిగింది. తాజాగా స్వాజీలాండ్ సైతం ఆ జాబితాలో చేరిపోయింది.

జింబాబ్వే, బుర్కినా ఫాసో, చాద్, జిబౌటీ, ఎరిట్రియా, గునియా, లైబీరియా, మాలావీ, మాలీ, మారటానియా, నైజర్, సియార్రా లియోన్, బురుండి, గణతంత్ర కాంగో, ఇథియోపియా, కెన్యా, లెసోతో, మడగాస్కార్, మొజాంబిక్, దక్షిణ సుడాన్, సుడాన్, ఉగాండా, ఆఫ్గనిస్థాన్, మయన్మార్, నేపాల్, తదితర దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: