అవును.. మీరు చూస్తుంది నిజమే.. నేటి మంచి మాట ఇది. నిజాయితీ... నమ్మకం లేనిచోట స్నేహం ఎక్కువకాలం నిలబడదు.. స్నేహం అనే కాదు.. నిజాయితీ ఉంటేనే ఏ బంధం అయినా నిలుస్తుంది. అలా కాదు అని ముందు ఒకలా.. వెనుక ఒకలా ఉంటె.. ఎప్పటికైనా నిజం తెలియకపోదు.. నిన్ను దూరం పెట్టకుండా ఉండరు.

 

అందుకే పరిస్థితి ఏలాంటి నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి.. ఉన్నదీ ఉన్నట్టు చెప్పండి. ఎవరికో భయపడి అబద్దం చెప్తే మీ క్యారెక్టర్ ను చంపుకున్నట్టే. నిజాయితీగా ఉండండి నమ్మకం పెంచుకోండి. ఒకవేళ అది చెప్పే నిజం కాకపోతే అది ఏదైనా వాళ్ళను మోసం చెయ్యకుండా ఉండాలి అంటే అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టండి. 

 

లేదు అంటే మనోవేదన చెందక తప్పదు. ఒకవేళ మీరు నిజంగా నిజాయితీగా.. నమ్మకం లేకపోతే మీ స్నేహం ఎలాంటిది అయినా ఎక్కవ కాలం నిలవదు.. ఈ సామెత ఒక్క స్నేహానికి మాత్రమే కాదు.. భార్య భర్తల బంధం అయినా.. తల్లి కొడుకుల బంధం అయినా నమ్మకంగా ఉండండి.. అప్పుడే మీ స్నేహ బంధం బలంగా ఉంటుంది. లేదు అంటే పైన చెప్పిన సామెత ప్రకారం బంధం ఎప్పుడైనా తుణిగిపోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: