సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పిల్లలు ఏడవటం సహజం.. అంటే వారికి కావలసిన వస్తువు ఏదైనా సరే అందకపోతే, వారు ఏడుపు మొదలు పెడతారు.. ఇక వారికి నచ్చింది ఇచ్చేవరకు ఏడుపు ఆపరు.. అందుకే చిన్న పిల్లలు అడిగింది వెంటనే ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు.. అయితే కేవలం వస్తువుల విషయంలోనే కాదు సంస్కారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోతే, వారు పెరిగి పెద్దయిన తర్వాత ఎలా మారుతారో ఎవరికీ తెలియని పరిస్థితులు ఏర్పడతాయి..
"మొక్కై వంగనిది..మానై వంగునా.. " అన్న ఈ సామెతను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడే మనం ఎలాంటి సంస్కారం నేర్పకోలేకపోతే, వారు పెద్ద అయిన తర్వాత కూడా ఎంత ప్రయత్నించినా, ఆ సంస్కారం మన దగ్గరకు దరిచేరదు. ఇక సంస్కారం లేని వ్యక్తి తో మాట్లాడడానికి ఎవరు కూడా ఇష్టపడరు.. అందుకే పెద్ద వాళ్ళు చిన్న పిల్లలతో చిన్నగా ఉన్నప్పుడే, వారికి అన్నివిధాలా,అన్ని రకాల పద్ధతులను, అలవాట్లను నేర్పించాల్సి ఉంటుంది..
అంటే మన కంటే పెద్ద వాళ్ళతో ఎలా ఉండాలి.. మనకంటే చిన్న వాళ్లతో ఎలా ఉండాలి..మన తోటి స్నేహితులతో ఎలా ఉండాలి.. అలాంటివి చిన్న చిన్నవి అయినా సరే, ముందుగానే నేర్పిస్తే పెద్దయిన తర్వాత వారు కూడా సమాజంలో చాలా ఉన్నతస్థాయికి చేరుకుంటారు.. చిన్న పిల్లలు కదా మారం చేస్తున్నారని వదిలేస్తే మాత్రం, పెద్దయిన తర్వాత దేశానికి ఎటు పనికిరాని వ్యక్తిని మనం పరిచయం చేసిన వారం అవుతాము.
కాబట్టి చిన్న పిల్లల విషయంలో పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు ఏమి ఆలోచిస్తున్నారో..తెలుసుకుని, అందుకు తగ్గట్టు తగుజాగ్రత్తలు, అలాగే నిర్ణయాలు, ఇంకా వారికి అర్థమయ్యేలా చెప్పే అన్ని విషయాలలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటే,చిన్న పిల్లల ఆలోచనా విధానాలు కూడా సక్రమంగా ఉంటాయి. ఇక చిన్నప్పుడు ఎంత సంస్కారంతో ఉంటారో అదే సంస్కారం పెద్దయిన తర్వాత కూడా వస్తుంది. ఇక వారికంటూ సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి