నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్ గేమ్స్ కు ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. గత సంవత్సరమే జరగాల్సిన 2020 ఒలింపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు జపాన్ లోని టోక్యో వేదికగా జరుపుతున్నారు. నేడు 12 వ రోజు పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇందులో ఈ రోజు ఉదయం భారత పురుషుల హాకీ టీమ్ ప్రపంచ నంబర్ వన్ బెల్జియం తో సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడింది. ఖచ్చితంగా బంగారు పతకాన్ని సాధిస్తారనుకున్న పురుషుల జట్టు పేలవమైన ప్రదర్శనతో ఫైనల్ కు ముందు దారుణంగా ఓడిపోయింది. భారత్ ఓడినా సరే ప్రజల నుండి వీరికి ఆశేషమైన అభిమానం దొరుకుతోంది.
ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం, మీరు పోరాడారు... ఓడినందుకు మాకేమీ బాధలేదని ట్వీట్ చేయడం వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. ప్రస్తుతం వీరు దూరమైంది బంగారు పతకానికి మాత్రమే. కాంస్యం పతకం గెలిచేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హాకీ విభాగంలో సెమీఫైనల్ అడనున్న మహిళల టీమ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. పురుషుల జట్టు ఓటమి పాలవ్వడంతో భారత్ అభిమానులు అంతా వీరిపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రేపు జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు అర్జెంటీనా తో సెమీఫైనల్ లో తలపడనుంది.
ఈ మ్యాచ్ కనుక గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే. అర్జెంటీనా ను అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్ చేజారినట్లే. ఇంతకు ముందు చేసిన పొరపాట్లను పునరావృతం చేయకుండా సమిష్టిగా పోరాడితే ఫైనల్ కు చేరుకోవడం అంతా కష్టమేమీ కాదు. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడినా, పుంజుకున్న తీరు అమోఘం. ఇదే ఉత్సాహంతో అర్జెంటీనాను ఓడిస్తే చాలు...భారతదేశ అభిమానులు సంతోషంతో ఒప్పొంగిపోతారు. కమ్ ఆన్ గర్ల్స్...యు కెన్ విన్ గోల్డ్ మెడల్... ఆల్ ది బెస్ట్...!

మరింత సమాచారం తెలుసుకోండి: