ఇటీవలే ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బెంగుళూరు  జట్టు ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. అలాంటి దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది బెంగళూరు  జట్టు. అప్పుడు క్రీజ్లోకి వచ్చిన దినేష్ కార్తీక్  తన టెర్రిఫిక్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటమె కాదు మ్యాచ్ మొత్తాన్ని కూడా రాజస్థాన్ రాయల్స్ వైపు తిప్పేశాడు.


 అయితే మ్యాచ్ గెలవడానికి అటు దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే  మరోవైపు నుంచి పూర్తి సహకారం అందిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీల తో  రెచ్చిపోయిన షాబాద్ అహ్మద్ ఇన్నింగ్స్   కూడా అంతే కీలకం. 26 బంతుల్లో 4 ఫోర్లు మూడు సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్ పై అందరూ ప్రశంసలు కురిపించారు కానీ యువ ఆటగాడు షాబాజ్ అహ్మద్ గురించి మాత్రం ఎక్కువమంది మాట్లాడలేదు. కేవలం 21 ఏళ్ల అనుభవం లేని ఆటగాడు రాజస్థాన్ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కోవడం గ్రేట్ అని చెప్పవచ్చు.. అయితే ఇలా ఇటీవలే అద్భుతమైన ఇన్నింగ్స్ తో అలరించిన షాబాజ్ అహ్మద్ లైఫ్ స్టోరీ మాత్రం ఎంతో కొత్తగా ఉంటుంది.


 పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా నగరంలో పుట్టాడు షాబాద్ అహ్మద్. ఇక ప్రస్తుతం ఓ ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు యువ ఆటగాడు. ఇక ఐపీఎల్ ఆడటం ఇది మూడోసారి అని చెప్పాలి. బెంగాల్ రంజీ ట్రోఫీలో ప్రస్తుతం షాబాజ్ అహ్మద్ ముఖ్య పాత్ర వహిస్తున్నాడూ అని చెప్పాలి. చిన్నప్పుడు ఇంజనీర్ కావాలనుకున్న ఇతను తన స్నేహితులతో కలిసి స్కూల్ ఎగ్గొట్టి మరీ రంజీ మ్యాచ్ లను  చూసేందుకు వెళ్లేవారట. అలా అతనికి క్రికెట్పై ఎంతగానో మక్కువ పెరిగింది. 2018 - 19 విజయ్ హజారే ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు. ఇక ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ లో నే ఐపీఎల్ లోకి అడుగు పెట్టడం గమనార్హం. ఇటీవలే  జరిగిన మెగావేలంలో మరోసారి ఈ యువ ఆటగాడు బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl