
ఈ నేపథ్యంలో, తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఒక ఎమోషనల్ నోట్ రాస్తూ ఇలా పేర్కొన్నారు..“కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నా హృదయం ముక్కలైపోయింది. ఈ బాధను మాటల్లో చెప్పలేను. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రాణాలు కోల్పోయిన నా సోదరీ, సోదరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” అంటూ రాసుకొచ్చాడు. విజయ్ రాసిన ఈ నోట్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆయన ఇచ్చిన రియాక్షన్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
కొంతమంది అభిమానులు విజయ్ ఎమోషనల్ నోట్ షేర్ చేయడం సరైన చర్య అని అభినందించగా, మరికొందరు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాల్సింది. కేవలం నోట్ రాయడం సరిపోతుందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కొందరు ఇలా విమర్శిస్తున్నారు..“పది వేల మందికి సరిపడే ప్రాంగణంలో ముప్పై వేల మందిని అనుమతించడం ఎందుకు?”.
“మీటింగ్ ఏర్పాటు చేసే ముందు పోలీసులతో సరైన సెక్యూరిటీ గురించి మాట్లాడలేదా?”“రాజకీయ హంగామా కోసం అమాయకుల ప్రాణాలను బలి చేస్తారా..?.”ఇక కొంతమంది నెటిజన్లు మరింత తీవ్రంగా స్పందిస్తూ, “విజయ్ దళపతిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగింది” అని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై సీఎం ఎం.కే. స్టాలిన్ కూడా సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపించనుంది. మొత్తం మీద, రాజకీయ రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే విజయ్ భారీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన చేసిన మీటింగ్‌లో జరిగిన తొక్కిసలాట, మరణాలు, గాయాల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది.ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు, సాధారణ ప్రజలు అందరూ ఇప్పుడు విజయ్ దళపతి వైపు గట్టి చూపులు సారిస్తున్నారు. “ఎమోషనల్ నోట్ సరిపోదు, కనీసం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించాలి” అన్న డిమాండ్ మరింత జోరుగా వినిపిస్తోంది.