ఇటీవల కాలంలో జుట్టు రాలడం అనేది అందరికీ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే . జుట్టు ఉంటే ఎంతో అందంగా ఉన్నావు అనుకున్న వారు ఇక కాస్త జుట్టు రాలడం మొదలయింది అంటే చాలు సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక డాక్టర్ల సూచన మేరకు ఎన్నో రకాల మందులు కూడా వాడుతూ ఉంటారు. ఇక షాంపూ కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ జుట్టురాలే సమస్య మాత్రం వేధిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక మరి కొంతమంది జుట్టు మొత్తం రాలిపోయిన తర్వాత కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా హెయిర్ ప్లాంటేషన్ లో రాలిపోయిన జుట్టును మళ్ళీ తలపై ప్లాంటేషన్ చేయించుకుని ఇక అంతకు ముందు జుట్టు ఎలా ఉండేదో అలా మార్చుకుంటున్నారు. ఇలా కేవలం సామాన్యుల మాత్రమే కాదు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా హెయిర్ ప్లాంటేషన్ ను ఆశ్రయిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు క్రికెటర్లు సైతం హెయిర్ ప్లాంటేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పటికే భారత క్రికెట్లో మాజీ ఆటగాళ్లు గా కొనసాగుతున్న  ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, అమిత్ మిశ్రా లు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారు.


 ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ ఆర్సిబి కెప్టెన్ పాప్ డుప్లెసిస్ సైతం హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు అన్నది తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇక హెయిర్ ప్లాంటేషన్ రిజల్ట్ పై సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల కాలంలో ఎంతోమంది క్రికెటర్లు జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు డూప్లెసిస్ హెయిర్ ప్లాంటేషన్ చేసుకోగా ఇక మరికొంతమంది కూడా ఇదే దారిలో వెళ్లే అవకాశం ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: