ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్ హవా నడుస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తోంది. అచ్చం ఇలాంటి లీగ్ తరహాలోనే అటు మరో సరికొత్త టీ20 లీగ్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది. అయితే ఇది పేరుకు ప్రోటీస్ లీగ్ అయినప్పటికీ ఇందులో పాల్గొన్న జట్లు కూడా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగమైన  ఫ్రాంచైజీలు కొనుగోలు చేసాయి.


 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జోహన్నెస్బర్గ్ జట్టును కొనుగోలు చేసింది. ఇలాంటి సమయంలోనే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన జోహన్నెస్బర్గ్ జట్టుకు మెంటర్ గా వ్యవహరించపోతున్నాడని వార్తలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే దక్షిణాఫ్రికా లీగ్ లో భారత ఆటగాళ్లు భాగం కానున్నారా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.


 కాగా ఇదే విషయంపై బిసిసీఐ అధికారి ఒకరు స్పందించారు అనేది తెలుస్తుంది. ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత ఆటగాడు ఎవరు కూడా విదేశీ లీగ్ లో ఆడే  అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా ఆడాలని కోరుకుంటే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరైన తర్వాత ఛాన్స్ ఉంటుందని..  ఇలా అన్ని ఫార్మాట్లలో నుంచి తప్పుకునేంత వరకు ఏ ఒక్క భారత క్రికెటర్ విదేశీ లీగ్ లను ఆడేందుకు అవకాశం ఉండదుఅంటూ స్పష్టం చేశారు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం దేశవాళి క్రికెట్ లో మాత్రం కొనసాగుతున్నాడు. దీంతో ధోనీ కూడా మెంటర్ గా వ్యవహరించడం అంత ఒట్టి మాట అన్నది అర్ధమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: