ప్రస్తుతం టీమిండియా లో కీలక బ్యాట్స్మెన్గా కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ గత కొంత కాలం నుంచి జట్టుకు దూరం అయ్యాడు అనే విషయం తెలిసిందే. భారత్లో వెస్టిండీస్ పర్యటనకు వచ్చిన సమయంలో ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు కె.ఎల్.రాహుల్. అతను  దూరం కావడంతో శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించారు. ఇక ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో కూడా కె.ఎల్.రాహుల్ ఆడలేదు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా గాయం నుంచి కోలుకుని జట్టు లో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో  కరోనా వైరస్ బారిన పడ్డాడు.


 ఇలా క్రమక్రమంగా చాలా రోజుల పాటు కె.ఎల్.రాహుల్ జట్టులోకి దూరమయ్యాడు అనే చెప్పాలి. భారత జట్టులో కీలక ఆటగాడు కావడంతో మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కాబోయే ఆసియా కప్లో భాగంగా భారత జట్టు యాజమాన్యం అతనికి టీంలో అవకాశం కల్పించింది.  అతని ఫామ్ నిరూపించుకునేందుకు ఇటీవల జింబాబ్వే పర్యటనలో భాగంగా అతనికి అవకాశం కల్పించింది అన్న విషయం తెలిసిందే. కాగా అతనికి ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అని తెలుసుకోవడానికి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారూ.


 ఈ క్రమం లోనే మొదటి మ్యాచ్లో భాగం గా అతనికి ఆడే అవకాశం కూడా రాలేదు. ఇక రెండో మ్యాచ్లో బరిలోకి దిగినప్పటికీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వికెట్ కోల్పోయి ఘోరం గా నిరాశపరిచాడు. దీంతో ఇంకో వారం రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యం లో అతడి ఫాం పై అభిమానులు సర్వత్రా ఆందోళన నెలకొంది అని చెప్పాలి. ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అతడు ఫామ్ లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: