క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అని అంటూ ఉంటారు ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్.  ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్యాచ్లు సరిగ్గా పడితే ఆ జట్టు తప్పక విజయం సాధిస్తుంది అని దీని అర్థం వస్తుంది. ఒకవేళ క్యాచ్లు పొరపాటున వదిలేసిన కూడా చివరికి జట్టు ఓడిపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తూ ఉంటారు ఎంతోమంది. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు ఒత్తిడిలో ఎంతో సింపుల్ అన్న క్యాచ్ లను కూడా వదిలేసి తీవ్ర స్థాయిలో విమర్శలు పాలవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఇలా వదిలేసినా క్యాచ్లు చివరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి క్యాచ్ మిస్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ క్యాచ్ మిస్ పాకిస్థాన్ జట్టులో కొత్తేమీ కాదు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్న మాట. ఎన్నో ఏళ్ల నుంచి పాకిస్థాన్ జట్టులో ఇలాంటి సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది అని అంటున్నారు నేటిజన్లు.



 శ్రీలంక జట్టు 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంతో కట్టుదిట్టంగా  కనిపించింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సా శ్రీలంకను కష్టాలనుంచి గట్టెక్కించాడు. రాజపక్స హాఫ్ సెంచరీ తర్వాత చివరి ఓవర్లలో పరుగులు వేగాన్ని పెంచాడు. ఇలాంటి సమయంలోనే బంతి వేసాడు మహ్మద్ హస్నయిన్ వేసిన బంతిని రాజపక్స డీప్ మిడ్ వికెట్ బౌండరీ వైపు ఎత్తుగా ఆడాడు. ఈ క్రమంలోనే అసిఫ్ అలీ బంతిని పట్టుకోడానికి పరిగెత్తాడు. అతను క్యాచ్ కూడా తీసుకున్నాడు.  ఈ క్రమంలోనే క్యాచ్ పట్టెందుకు మరో వైపు నుంచి వేగంగా దూసుకు వచ్చిన శాదాబ్ ఆసిఫ్ అలిని ఢీ కొట్టాడు.  దీంతో క్యాచ్ నేలపాలు అయ్యింది.  వికెట్ పోవాల్సింది కాస్త సిక్సర్ గా మారిపోయింది. ఇక ఇది చేసిన నెటిజన్లు పాకిస్తాన్ లో ఇలాంటివి జరగడం కొత్తేమీ కాదు జట్టు మారిన పాత అలవాట్లు మారడం లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు  నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: