అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. ఈ ప్రపంచకప్ ప్రారంభం నేపథ్యంలో ఇక ఇటీవలే బీసీసీఐ ఆడబోయే టీమ్ ఇండియా జట్టు వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ మళ్లీ టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నారు. మహ్మద్ షమి కూడా జట్టుకు సెలెక్ట్ అయ్యాడు  కానీ కేవలం స్టాండ్బై ప్లేయర్గా మాత్రమే అతని ఎంపిక చేసినట్లు బిసిసిఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతోమంది మాజీ క్రికెటర్లు ఈ విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.


 బీసీసీఐ సెలెక్ట్ చేసిన వారు కాకుండా తుది జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ఎంతో మంది మాజీ క్రికెటర్లు.  ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహమ్మద్ షమి టీమిండియా లోకి తీసుకొని ఉంటే బాగుండేది అని అభిప్రాయ పడ్డాడు. ఒకవేళ తాను గనుక బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉండి ఉంటే తప్పకుండా మహమ్మద్ షమినీ టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసే వాడిని అంటూ తెలిపాడు.


 బి సి సి ఐ టి 20 ప్రపంచకప్ కోసం సెలెక్ట్ చేసిన హర్షల్ పటేల్ మంచి క్రికెటరే. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు.  కానీ అతడి ప్లేస్ లో మహ్మద్ షమీ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్లపై బౌన్స్ రాబట్టడం కాస్త అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమికి బాగా తెలుసు. అంతేకాదు వికెట్ను పడగొట్టడంలో కూడా అతను ఎప్పుడు ముందుంటాడు అంటూ కృష్ణమాచార్య శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి స్టాండ్బై ప్లేయర్ గా ఎంపికైన మహ్మద్ షమి తన  ప్రదర్శనతో ఆకట్టుకుని తుది జట్టులోకి వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: