అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే టి-20 ప్రపంచ కప్ లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అయితే ఇటీవలే ఆసియా కప్ ముగించుకుంది టీమ్ ఇండియా ప్రపంచ కప్కు ముందు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి. ఒక రకంగా ఈ రెండు దేశాల తో టి 20 సిరీస్ లు టీమిండియాకు ఎంతగానో కలిసివచ్చే అంశమని చెప్పాలి.


 ఎందుకంటే టి20 ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టీ20 సిరిస్ లు ఇండియా కు ప్రాక్టీస్ మ్యాచ్లు గా మారబోతున్నాయి అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇక ఈ రెండు దేశాలతో టి20 సిరీస్ ల కారణంగా ఇండియా కాంబినేషన్ సెట్ చేసుకునే అవకాశం కూడా టీమిండియాకు దొరికింది అనే చెప్పాలి.


 ఇకపోతే  సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లతో టి 20 సిరీస్ లో ఆడబోయే జట్టు వివరాలను ఇటీవలే బిసిసీఐ అధికారికంగా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియాతో మరికొన్ని రోజుల్లో టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా భారత జట్టు సొంత గడ్డపై ఎలా  రాణించ పోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లో జరగబోయే టి20 సిరీస్ లో గెలవడం ఒక్కటే టీమిండియా లక్ష్యంగా పెట్టుకోవద్దు అంటూ సూచించాడు.


 అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో గెలుపు ఒక్కటే టార్గెట్గా పెట్టుకుంటే సరిపోదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్ లో ఎవరు ఏ కాంబినేషన్ లో బరిలోకి దిగాలి. ఇక టీ20 సిరీస్ లో ఇప్పుడే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సూచించాడు. దీనిపై టీమిండియా యాజమాన్యం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రత్యేకమైన దృష్టిసారించాల్సి ఉంది అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. టీమిండియా కాంబినేషన్ ను సెట్ చేసుకోవడానికి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లతో సిరీస్ లను కెప్టెన్ రోహిత్ శర్మ సద్వినియోగం చేసుకుంటాడు అని అనుకొంటున్నాను అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: