వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో అటు మొన్నటి వరకు పటిష్టంగా కనిపించిన టీమిండియా కు ప్రస్తుతం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. వరల్డ్ కప్ కి కూడా అందుబాటులో ఉండడం లేదు. ఇక ఇప్పుడు బుమ్రా కూడా గాయం తీవ్రతరం కావడంతో చివరికి జట్టు నుంచి తప్పుకున్నాడు అన్న వార్తలు గుప్పుమాన్నాయ్. దీంతో భారత అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.


 అయితే బుమ్రా స్థానంలో ఎవరిని  తీసుకోవాలి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. సిరాజ్ జట్టులోకి రాబోతున్నాడు అని టాక్ వినిపించినప్పటికీ టెస్టుల్లో రాణించినంతగా అటు టి20 లో మాత్రం రాణించలేకపోతున్నారు సిరాజ్. ఇక మహమ్మద్ షమీ ఆస్ట్రేలియా పిచ్  లపై బాగా రాణించగలడా అన్నది కూడా డౌటే.  దీంతో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఎవరూ ఊహించని విధంగా అటు కొత్త ఆటగాడి పేరు తెరమీదకి వచ్చింది.


 ఆ కొత్త ఆటగాడు ఎవరో కాదు తన బౌలింగ్తో సంచలనం సృష్టించి ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్ లలో కూడా టీమిండియా తరఫున కూడా అవకాశం దక్కించుకున్నాడు  నటరాజన్.  హైదరాబాద్ జట్టులో కొనసాగుతూ స్టార్ ఫేసర్గా యార్కర్ కింగ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో 11 మ్యాచ్లలో 18 వికెట్లు తీసాడు. ఆస్ట్రేలియా పిచ్ లపై ఆడిన అనుభవం కూడా ఉంది.  టి20 ఫార్మాట్లో ఎప్పుడూ అద్భుతంగా రానిస్తూ ఉంటాడు. దీంతో ఒకవేళ బుమ్రా జట్టుకు దూరమైతే అతని స్థానంలో నటరాజన్ కి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్ మైండ్ రాహుల్ ద్రావిడ్ అతన్ని ఎందుకు పక్కన పెడుతున్నాడో అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: