టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో ఏళ్ల తర్వాత కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగిన టీమిండియా జట్టు.. ఈసారి విశ్వవిజేతగా నిలబడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బౌలింగ్ విభాగం లో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు ఇక ప్రత్యర్థి తో జరిగిన ప్రతి మ్యాచ్ లో ఆదిపత్యాన్ని చలాయిస్తూ ఇక ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తుంది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ కి ముందు వరుసగా ద్వైపాక్షిక సిరీస్లలో విజయం సాధిస్తూ జోరు చూపించిన టీమిండియా జట్టు ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా ఇదే దూకుడు కొనసాగిస్తుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి  అయిన పాకిస్తాన్ ను ఢీకొట్టిన భారత జట్టు కఠిన పరిస్థితుల మధ్య చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇలా పాకిస్తాన్ పై విజయంతో బోనీ కొట్టిన భారత జట్టు ఇక ఇటీవలే నెదర్లాండ్స్ పై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. పసికూన జట్టు అయినప్పటికీ కూడా లైట్ తీసుకోని భారత జట్టు సీరియస్గా ఆడి చివరికి 56 పరుగులు తేడాతో నెదర్లాండ్ పై విజయం సాధించింది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ పై విజయం సాధించినప్పటికీ.. తాను మాత్రం సంతోషంగా లేను అంటూ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూపర్ 12 కూ అర్హత సాధించిన నెదర్లాండ్స్ ను తక్కువ అంచనా వేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఆరంభంలో తాము నెమ్మదిగా ఆడామని భారీ షాట్లు ఆడేందుకు వీలుగా పిచ్ మారేవరకు వెయిట్ చేయాలని తాను కోహ్లీ మాట్లాడుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. హాఫ్ సెంచరీ తో తనకు పెద్దగా సంతోషం కలగలేదని ఇంకా పరుగులు రాబట్టడమే తన లక్ష్యం అంటూ రోహిత్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: