సాధారణంగా టీమ్ ఇండియా బాగా రాణించిన ఓర్వలేని వ్యక్తులు  అటు ప్రపంచ క్రికెట్ లో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే కేవలం పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే ఇక టీమ్ ఇండియా పై తమ అక్కస్సును వెలగకుతూ ఉంటారు అని క్రికెట్ ప్రేక్షకులకు తెలుసు. కానీ టీమిండియాపై పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే కాదు ఇంగ్లాండు కు చెందిన కొంతమంది ఆటగాళ్లు కూడా టీమిండియా పై ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఏకంగా టీమ్ ఇండియాని టార్గెట్ చేసి అవాక్కులు చవాక్కులు పేలే వారిలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మొదటి వరుసలో ఉంటాడు.


 ఎప్పుడు టీమిండియా జట్టు గురించి నెగిటివ్ గా మాట్లాడే మైకల్ వాన్ ఇక ఇటీవల 2022 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో కాస్త కళ్ళు నెత్తికెక్కి భారత జట్టుపై తన నోటి దురుసు మరోసారి ప్రదర్శించాడు అని చెప్పాలి. ఏకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా కొనసాగుతున్న టీమ్ ఇండియాను అవమానకర రీతిలో చులకన చేసి మాట్లాడటం గమనార్హం. 2023లో భారత్ వేదికగా అన్ని జట్లు వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఇక అటు టీమిండియా మాత్రం ఎప్పటికీ ఫేవరెట్ జట్టు కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.



 టైటిల్ ఫేవరెట్ జట్టు ట్యాగ్ కేవలం  డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినా ఇంగ్లాండ్ జట్టుకు మాత్రమే పొందే అర్హత ఉంది అంటూ గొప్పలకు పోయాడు మైకల్ వాన్. ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఇండియాకు టైటిల్ ఫేవరెట్ అనిపించుకునే అర్హత లేదని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదంతా నాన్సెన్స్ అంటూ అవమానకర రీతిలో టీమ్ ఇండియాను చులకన చేసాడు. భారత్లో జరిగే వరల్డ్ కప్ లో టీం ఇండియా ఫేవరెట్ అంటే అస్సలు ఒప్పుకోనని.. వరల్డ్ కప్ ఎక్కడ జరిగిన ఫేవరెట్ జట్టుగా ఇంగ్లాండే ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: