కొన్ని వృక్షాలు మరియు మొక్కలు దేవతా స్వరూపాలుగా చెప్పబడుచున్నాయి. వాటిలో రావి చెట్టు కూడా ఒకటి. అయితే మన కష్టాలు తొలగిపోయి కలహాలు మాసిపోయి ప్రశాంతంగా సంతోషంగా జీవించాలన్నా , మన ఇంట్లో ఆర్ధిక సమస్యలు తీరాలన్నా శనివారం నాడు రావి ఆకును చేతిలో పెట్టుకుని ఇలా చేస్తే చాలట. ఇక అంతా శుభమే అంటున్నారు  పండితులు. ఇంతకీ ఈ విధానాన్ని ఎలా ఆచరించాలో ఇపుడు తెలుసుకుందాం.  శనివారం రోజున ఉదయాన్నే లేచి స్నానమాచరించి శుభ్రమైన  వస్త్రాలు ధరించి రావి చెట్టు దగ్గరకు వెళ్లాలి. గుళ్లో ఉన్న రావి చెట్టు అయినా సరే లేదా, బయట ఇంకెక్కడైనా ఉన్నటువంటి రావిచెట్టు అయినా సరే పర్వాలేదు. 

అక్కడికి వెళ్లి నేలపై రాలిన రావి ఆకును తీసుకొని చేతిలో పట్టుకొని మీ కోరికను ఆ దేవునితో చెప్పుకుంటూ 21సార్లు ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఆ రావి ఆకు ను చెట్టు మొదట్లో ఉంచి నమస్కరించుకుని తిరిగి ఇంటికి వెళ్లి పోవాలి. అదే విధంగా మారేడు ఆకు అంటే పరమేశ్వరునికి ఎంత ప్రీతికరమో తెలిసిందే. కావున మారేడు ఆకు దొరికినా సరే.. ఆ మారేడు ఆకు పట్టుకొని శివాలయం చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి శివునికి సమర్పించడం మంచిది.  ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి అమృత ఘడియలు మొదలవుతాయి. శనివారం రోజున ఇలా చేయాలని పండితులు చెబుతున్నారు. 

ముఖ్యంగా మూడవ ఆషాడ శనివారం నాడు ఇలా చేయడం మరింత శ్రేయస్కరం. నేడు ఆషాడ మాసంలో వచ్చినటువంటి మూడవ శనివారం సందర్భంగా భక్తులు ఇలా చేసినట్లయితే వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని అంటున్నారు. మరి మీరు కూడా ఇలా చేసి చూడండి. శనివారం మాత్రమే కాదు, పండితుల సలహా మేరకు ఈ వారమయినా ఎలా పూజ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: