ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో క్రికెట్ సందడి డబుల్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజుల్లో ఐపిఎల్ 2020 సీజన్ స్టార్ట్ అవ్వబోతుందని  అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో.. బీసీసీఐ  కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరోనా  వైరస్ నియంత్రణకు బీసీసీఐ  సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2020 సీజన్ను వాయిదా  చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ నిర్వహిస్తామంటూ తెలిపింది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ పై రోజుకొక వార్త సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తోంది. ఐపీఎల్ ను ఏప్రిల్  15 వరకు వాయిదా వేశారు కానీ ప్రస్తుతం రోజురోజుకీ కరోనా  వైరస్ వ్యాప్తి దేశంలో పెరిగిపోతున్న తరుణంలో... ఐపీఎల్ సీజన్ జరగడం కూడా కష్టమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 

 అయితే ఇప్పటికే ఐపీఎల్  ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి కసరత్తు చేస్తున్నప్పటికీ అధి కార్య రూపం  మాత్రం దాల్చడం లేదు అని తెలుస్తుంది. అటు క్రికెట్ పండితులు కూడా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ రద్దవ్వటం  ఖాయం అని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఐపీఎల్ రద్దు అయితే ఆ  ఐదుగురు క్రికెటర్లపై కెరీర్ మాత్రం ప్రశ్నార్థకంలో పడిపోతుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న టి20 వరల్డ్ కప్ ఆడాలని... ఎన్నో ఆశలు పెట్టుకున్న 5 క్రికెటర్లకు ఐపీఎల్ 2020 సీజన్ లో  రాణించడం ఎంతో కీలకంగా మారిపోయింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి జట్టుకు దూరంగా ఉంటున్న వాళ్ళు ఐపీఎల్ లో  రాణించి వరల్డ్ కప్ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు ఆటగాళ్ళు. 

 


 వీరిలో మొదటి వ్యక్తి మహేంద్రసింగ్ ధోని. 2019 వన్డే ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన తర్వాత క్రికెట్ కి దూరంగా ఉంటున్న ధోని ... 2020 లో జరగబోయే టి20 ప్రపంచకప్లో ఆడాలని భావిస్తున్నారు. మరి గత ఆరు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న ధోనీ ఐపీఎల్ లో రాణించి  జట్టులో స్థానం సంపాదించుకోవాలని అనుకున్నాడు.  ఇక దాదాపు చాలా రోజుల తర్వాత చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కానీ అంతలోనే ఐపీఎల్ కాస్త వాయిదా పడింది. ఒకవేళ ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ నిర్వహిస్తే ధోని కెరియర్ గురించి చెప్పలేం కానీ.. ఐపీఎల్ రద్దు అయితే మాత్రం ధోని కెరియర్ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. 

 

 సంజు సాంసన్.. సుదీర్ఘకాలం పాటు జట్టులో సుస్థిరస్థానం కోసం  ఎదురు చూస్తూనే ఉన్నాడు సంజూ సాంసన్. టీమ్ ఇండియా యాజమాన్యం సంజు శాంసన్ కి అవకాశాలు వచ్చినప్పటికీ నిరూపించుకో లేకపోయాడు. అతనికి జట్టులో స్థానం  ఇవ్వాలంటే ఐపీఎల్లో రాణించడం కీలకంగా మారింది. ఐపీఎల్ తప్ప ప్రత్యామ్నాయ మార్గం మాత్రం ఏది  కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అతని  కెరీర్ కి  ఎంతో కీలకం గా మారిపోయింది. 

 

 ఇంకొకరు పృద్వి షా .. భారత యువ సంచలనం గా పేరు పొందిన పృద్వి షా  మొదట్లో ఎన్నో మెరుపులు మెరిపించారు. కానీ ఇటీవల టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్న...  ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయాడు. అయితే టి20 వరల్డ్ కప్ కి మూడో  ఓపెనర్గా ఎంపిక అవ్వాలన్నది పృద్విషా  లక్ష్యం . ఈ నేపథ్యంలో గత ఏడాది డోపింగ్ టెస్టులో ఫెయిలై కొన్ని నెలల పాటు నిషేధం ఎదుర్కొన్న... ప్రతి విషయం పునరాగమనం లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. ఇప్పుడు ఐపీఎల్ మొదలైతే ఐపీఎల్ లో రాణించి వృత్తిలో స్థానం సంపాదించేందుకు తహతహలాడుతున్నాడు. ఒకవేళ ఐపీఎల్ రద్దు అయితే మాత్రంఅతని  ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుంది. 


 మరొక ఆటగాడు శుభ్ మన్  గిల్ . అయితే ఈ ఆటగాడు భారత జట్టులోకి ఎంపిక అవుతున్నప్పటికీ... తుది జట్టులో స్థానం దక్కించుకోగా బెంచ్ స్ట్రెంత్ కే  పరిమితమై పోతున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఐపీఎల్లో రాణించాలని గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఇతగాడు  ఐపీఎల్ ప్రతి అయితే అతని కెరీర్ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. 

 

 రిషబ్ పంత్... టీమిండియాలో వరుసగా పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకున్న ఆటగాడు రిషబ్ పంత్. ఎన్ని అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన ఫామ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే రిషబ్ పంత్ మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకోవాలంటే ఐపీఎల్లో రాణించడం ఎంతో ముఖ్యం గా మారింది. లేనిపక్షంలో జట్టులో రిషబ్ పంత్ కి ఇప్పట్లో స్థానం దక్కడం మాత్రం కష్టతరమైన పనే .

మరింత సమాచారం తెలుసుకోండి: