ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో క్రీడలు సినిమాలు అన్నీ ఆగి పోయాయి. ఇక ఎప్పుడూ మైదానంలో బిజీబిజీగా ప్రాక్టీస్ సెషల్ లో ఉండే క్రీడాకారులు అందరు  ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. హాయిగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు. అయితే ప్రపంచంలోనే ది బెస్ట్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు అభిమానులను అలరిస్తోనే  ఉన్నాడు.  మామూలుగానే ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్న విషయం తెలిసిందే. 

 


 కాని ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పంచుతున్న ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతకు మించి అనేంతలా  ఉంది. టిక్ టాక్ అకౌంట్ ఓపెన్ చేసిన డేవిడ్ వార్నర్ రోజు సరికొత్త వీడియోలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొన్నటి వరకు క్రికెట్ తో అభిమానులను సంపాదించుకున్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడు సరికొత్త వీడియోలతో ఎంట్రీ ఇస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే మ్యూజిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు డేవిడ్ వార్నర్. 

 


 తాజాగా ఒక స్వీట్ మ్యూజిక్ కి డేవిడ్ వార్నర్ చేసిన డాన్స్ అద్భుతంగా అనిపించింది అని చెప్పాలి. తన ఇద్దరు కూతుర్లతో భార్యతో కలిసి డేవిడ్ వార్నర్ ఒక వైలన్  మ్యూజిక్ కి కంఫర్టబుల్గా కొన్ని స్టెప్స్ వేసాడు  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంతేకాదండోయ్ ఈ వీడియో లో  ఏకంగా డేవిడ్ వార్నర్ అన్న గారిని కూడా ఈ ఇమిటేట్ చేశాడు. సీనియర్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ చివర్లో వార్నర్ వేసిన స్టెప్  అందరిని ఆకర్షిస్తుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We are back again!! #challenge #family #boredinthehouse #isolation @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on

మరింత సమాచారం తెలుసుకోండి: