ఈ రోజు ఇండోర్ వేదికగా ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్యన మూడవ టీ 20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్ ను సాధించిన ఇండియా ఈ మ్యాచ్ ను అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. టాస్ గెలిచిన ఇండియా అందరూ ఊహించినట్లుగానే మొదట ఫీల్డింగ్ తీసుకుంది. అయితే తమ నిర్ణయం ఎంత పొరపాటు అన్నది తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు. మరోసారి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ దారుణంగా ఫెయిల్ కాగా, ఓపెనర్ డికాక్ తో జత కలిసిన వన్ డౌన్ బ్యాట్స్మన్ రిలీ రాసౌ లు ఇండియా బౌలర్లను కుదురుకోనివ్వకుండా ఎక్కడ బంతి వేసినా బౌండరీలవైపే తమ దృష్టిని పెట్టారు.

ఈ దశలో డికాక్ (68) అర్ద సెంచరీని పూర్తి చేసుకుని అనవసర పరుగులు యత్నించి అవుట్ అయ్యాడు. అయినా సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డు నెమ్మదించలేదు.. యువ ఆటగాడు స్టబ్స్ (23) సహాయంతో రాసౌ గ్రౌండ్ కు నాలుగు వైపులా బంతిని పంపిస్తూ పరుగులు రాబట్టాడు. గత మ్యాచ్ లో పర్వాలేదనిపించిన దీపక్ చాహర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మ్యాన్ అఫ్ ది సిరీస్ గా ఎంపిక ఐన అక్షర్ పటేల్ ఒక్క ఓవర్ మాత్రమే వేశాడంటే పరిస్థితి ఎంత దారుణమో మీరే ఆలోచించండి.

మ్యాచ్ లో హైలైట్ మాత్రం రాసౌ ఇన్నింగ్స్... మొదటి రెండు మ్యాచ్ లలో ప్రభావము చూపించలేకపోయిన ఇతను ఈ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా ఆడి సెంచరీ సాధించి తన జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే ప్రపంచంలో కల్లా బెస్ట్ బౌలింగ్ అటాక్ అని చెప్పుకునే ఇండియా ఈ విధంగా ప్రదర్శన చేయడం చాలా బాధగా అనిపించింది. మోనా మ్యాచ్ లో మిల్లర్ సెంచరీ సాధించగా, ఇప్పుడు రాసౌ సెంచరీ (100 పరుగులు కేవలం 48 బంతుల్లో) సాధించి ఇండియాపై టీ 20 లో సెంచరీ చేయడం అంత సులభం అని నిరూపించాడు. ఇకనైనా బౌలింగ్ అటాక్ మార్చుకోకపోతే వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజి దాటడం కూడా చాలా కష్టం.    


మరింత సమాచారం తెలుసుకోండి: