ఇండియాలో ఒకప్పుడు చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేవి ఆ కంపెనీ అందించిన ప్రీమియం కార్ల గురించి. స్కోడా ఆటో గడచిన 2001వ సంవత్సరంలో ఇండియా మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ, ఈ యూరోపియన్ కంపెనీ మాత్రం ఇటీవలే ప్రజలకు దగ్గర కావటం ప్రారంభించింది.ఇక గతంలో స్కోడా ఇండియా మార్కెట్లో ఫాబియా , ఏటి , సూపర్బ్ వంటి మంచి ప్రీమియం కార్లను అందించడం జరిగింది. అయితే, అప్పట్లో ఈ బ్రాండ్‌కు సరైన సేల్స్ ఇంకా సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవటం అలాగే స్పేర్స్ లభ్యత తక్కువగా ఉండటం ఇంకా ఈ కంపెనీ అందించే కార్లన్నీ కూడా చాలా ఖరీదుతో కూడుకున్నవి కావటం వంటి పలు కారణాలతో ఈ కార్లు ఇండియా మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి.స్కోడా అందించిన ఈ కార్లలో ఫాబియా కారుకు చాలా స్పెషాలిటీ అనేది ఉంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంకా హ్యుందాయ్ ఐ20 వంటి ప్రీమియం కార్లకు పోటీగా వచ్చిన ఈ స్కోడా ఫాబియా ఇండియా మార్కెట్లో 2008 నుండి 2013 వరకు అమ్మబడింది.

ఇక ఆ సమయంలో అయితే ఈ కారు ఇంటర్నేషనల్ మార్కెట్లలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యేది.కానీ, ఇండియాలో మాత్రం ఇది కంపెనీకి ఆశించిన విజయాలను సాధించపెట్టలేకపోయింది. స్కోడా తమ మొట్టమొదటి కారైన ఆక్టావియాను మార్కెట్లో విడుదల చేయటం ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2008 సంవత్సరంలో ఫాబియా హ్యాచ్‌బ్యాక్‌ కార్ ను పరిచయం చేసింది. ఆ తరువాత కంపెనీ ఇందులో రెండవ తరం మోడల్‌ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది.స్కోడా ఫాబియా ఇండియా మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సమయంలో స్కోడా కార్ల మెయింటినెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. వాటి స్పేర్ పార్ట్స్ కూడా అంత ఈజీగా దొరికేవు కావు, వాటి కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వచ్చేది. అప్పుడు ఈ బ్రాండ్ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ చాలా వీక్ గా ఉండటం, బ్రాండ్ పట్ల భారతీయుల్లో విశ్వసనీయత అనేది తక్కువగా ఉండటం లాంటి కొన్ని కారణాల వలన ఈ కారు ఇండియా మార్కెట్ నుండి తొలగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: