ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్ కచ్చితంగా ఉండనే ఉంటుంది. అయితే మన స్మార్ట్ మొబైల్లో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి వీటిని మనం అసలు పట్టించుకోము మనం కేవలం అందాన్ని చూసి మొబైల్ ని తీసుకుంటూ ఉంటారు.అంతేకాకుండా కొంతమంది కంపెనీ బ్రాండెడ్ చూసి కొనేవారు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి మొబైల్ లో కూడా ఫీచర్స్ చాలానే ఉంటాయి. కేవలం అందులో మనకి కొన్ని మాత్రమే తెలుస్తాయి. మన మొబైల్లో తెలియని ఒక ఫీచర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాస్తవానికి మన స్మార్ట్ మొబైల్ దివువ భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది..కానీ దాని పని ఏమిటి అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఇది వాస్తవానికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఇది కాల్ చేస్తున్నప్పుడు యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. ముందు ఉన్న వ్యక్తికి మీ వాయిస్ ని మాత్రమే ప్రసారమయ్యేలా చేస్తుంది. అందుకే ఇది మొబైల్ లో చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. మనం ఎక్కడైనా రద్దీ ప్రాంతాలలో కాల్ చేసినప్పుడు సాధారణంగా పలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలోనే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ బాగా ఉపయోగపడుతుంది.

వాస్తవానికి ఈ చిన్న హోల్ వాతావరణాన్ని కూడా తగ్గిస్తుంది రంద్రం కారణంగా మీ చుట్టూ కూర్చున్న వ్యక్తుల శబ్దం వాహనాల శబ్దం అలాగే అధిక శబ్దాన్ని తగ్గించి అవతలి వ్యక్తికి మన మాటలు చేర్చేలా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మనం మాట్లాడిన మాటలు అవతలి వ్యక్తికి చేరుతాయి. అందుచేతనే మనం మాట్లాడేటప్పుడు మొబైల్ హోల్ దగ్గర ఎలాంటి అడ్డు ఉండకుండా చూసుకోవాలి. అందుచేతనే ఈ రంద్రం మొబైల్ కి చాలా ముఖ్యమైనది. ఇక ఇదే కాకుండా మన మొబైలో ఎన్నో రక రకాల ఫీచర్స్ కూడా కలవు. ఈ విషయం తెలియని వారు జాగ్రత్త పడండి

మరింత సమాచారం తెలుసుకోండి: