తెలుగు రియాలిటీ షో లలో మంచి రేటింగ్ లతో దూసుకుపోతున్నఅతి పెద్ద షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకొని ఐదవ సీజన్ ప్రారంబించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి ,రెండవ సీజన్ ను జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ ను నాని హోస్ట్ చేయగా మూడు, నాలుగు సీజన్ లను నాగార్జున హోస్ట్ చేసారు.సీజన్-4  కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ ఆలస్యంగా ప్రారంభం అయిన అదిరిపోయే రేటింగ్స్ ని దక్కించుకుంది. ఇక ఐదవ సీజన్ ఎప్పుడా అని అందరు ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ లో ఐదవ సీజన్ ప్రారంభించడానికి బిగ్ బాస్ నిర్వాహకుల తెగ తొందరపడుతున్నట్లు తెలుస్తుంది.
                                               
అయితే బిగ్ బాస్ మూడు,నాలుగు సీజన్ లని హోస్ట్ చేసి అందరిని ఆకట్టుకున్న నాగార్జున ఐదవ సీజన్ హోస్ట్ గా చేయబోరని సమాచారం.ఆయన ఇప్పటికే కొన్ని సినిమాలను ఒప్పుకోవడం వలన ఐదవ సీజన్ కి దూరంగా ఉండనున్నారు. సీజన్-4 కరోనా సమయం లో రావడంతో బిగ్ బాస్ లో వచ్చిన క్రితం సీజన్ల కంటే ఎక్కువ రేటింగ్ లను రాబట్టింది. నాగార్జున కి మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. అయితే నాగార్జున కి బిజీ వల్ల ఇప్పుడు అతని స్థానం లోకి నాని వచ్చాడు. అయితే నాని ని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు జరిపగా త్వరలో ప్రారంభం కానున్న సీజన్-5 కి హోస్ట్ గా చేయడానికి నాని కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

గతంలో నాని రెండవ సీజన్ కి హోస్టుగా అలరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సీజన్-5 లో భాగంగా కంటెస్టెంట్లను ఫైనల్ చేయడానికి కొంతమంది యూట్యూబ్ స్టార్స్ ని, మరియు యాంకర్స్ ని కలిసినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అసలు బిగ్ బాస్ సీజన్ -5 నిజంగా ప్రారంభం అవుతుందా అనేది  మాటీవీ వారు ప్రకటించేవరకు మనకు తెలియదు కాబట్టి వారు చెప్పేవరకు వేచి చూడవలసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: