ప్ర‌తి రోజు మార్కెట్‌లోకి ఎన్ని కొత్త బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు దిగుతున్నా.. సాంసంగ్ ఫోన్ల‌కు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా ఇండియాలో సాంసంగ్ ప్రియులు భారీగానే ఉన్నారు. ఇక తాజాగా ఇండియాలో సాంసంగ్ నుంచి మ‌రో కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం21 పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది సాంసంగ్. ఇక సాంసంగ్ రిలీజ్ చేసిన గెలాక్సీ ఎం20 అప్‌గ్రేడ్ వర్షన్ ఇది.

 

సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, ఇన్ఫినిటీ యూ వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12,999. ప్రస్తుతం 4జీబీ+64జీబీ వేరియంట్ మాత్రమే అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ అయింది. అలాగే మిడ్‌నైట్ బ్లూ, రేవెన్ బ్లాక్ క‌ల‌ర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.

 

సాంసంగ్ గెలాక్సీ ఎం21 ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే..
- 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
- 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 4జీబీ, 6జీబీ ర్యామ్
- ఎక్సినోస్ 9611 ప్రాసెసర్
- 48+8+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

 

-  6,000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ
- డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 10+వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్
- 4జీబీ+64జీబీ ధ‌ర రూ.12,999 కాగా, 6జీబీ+128జీబీ ధర తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: